Phone Problems: దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేకుండా రోజులో కొన్ని గంటలు కూడా గడపలేని స్థితిలో చాలామంది ఉన్నారు. స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ వల్ల కొన్ని సందర్బాల్లో మానసిక సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల చర్మంపై రేడియేషన్ ప్రభావం పడుతుంది. ఎక్కువ సమయం కాల్స్ మాట్లాడేవాళ్లను చర్మ సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ ను ఎవరైతే ఎక్కువగా వాడతారో వాళ్లు కళ్ల చుట్టూ ఉండే చర్మం విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఈ సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు వైద్యుల సూచనలను పాటిస్తూ కంటికి సంబంధించిన క్రీమ్ లను వాడాలి. ఎక్కువ సమయం కాల్స్ మాట్లాడేవాళ్లు హెడ్ ఫోన్స్ ను వినియోగిస్తే మంచిదని చెప్పవచ్చు. చర్మంపై నల్లటి మచ్చలు ఉంటే స్కిన్ సీరమ్ తో చర్మంను రక్షించుకోవాలి.
సీరంలోని కొన్ని చుక్కలను చర్మంపై అప్లై చేయడం ద్వారా ముడతల సమస్యకు చెక్ పెట్టడంతో పాటు చర్మాన్ని బిగుతుగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లు ఇప్పటికే మొటిమల సమస్యతో బాధ పడేవాళ్లకు సమస్యను తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్ లలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఈ సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్ వాడకం జుట్టుపై కూడా ప్రభావం చూపుతుంది. స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల వృద్ధాప్య సంకేతాలు వచ్చే అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోన్ ను అతిగా వినియోగిస్తే మాత్రం ప్రమాదంలో పడ్డట్టేనని చెప్పవచ్చు.