Homeఎంటర్టైన్మెంట్Nara Rohith: వారి సమాధుల వద్ద నిరసన చేపట్టిన ప్రముఖ హీరో నారా రోహిత్... ఎందుకంటే...

Nara Rohith: వారి సమాధుల వద్ద నిరసన చేపట్టిన ప్రముఖ హీరో నారా రోహిత్… ఎందుకంటే ?

Nara Rohith: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు..ఆ తరువాత మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీరు పెట్టడం పైన నందమూరి – నారా కుటుంబ సభ్యులు వైసీపీ నేతల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబం మొత్తం ఈ అంశం పైన స్పందించింది. ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడిపై నారా రోహిత్‌ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు తల్లిదండ్రులు అయిన  నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద నారా రోహిత్ నిరసన చేపట్టారు.

nara rohith protest at tdp leader chandra babu nayudu parents graves

అన్న ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని.. ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని చెప్పుకొచ్చారు. పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఆదర్శంగా నిలిచారన్నారు. ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో చేసుకోలేదు…గడప దాటలేదని వివరించారు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెదని వివరించారు. అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసిపి నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసిపి నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదంటూ రోహిత్ వాపోయారు. ఈ మేరకు నిన్న రోహిత్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం రోహిత్ నిరసన చేపట్టిన వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నారా రోహిత్ సినిమాలు గత కొంతకాలంగా ఏవి రిలీజ్ కాలేదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version