https://oktelugu.com/

Actress Samantha: మంత్రి కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన నటి సమంత…

Actress Samantha: సమంత గురించి కొత్తగా పరిచయం చేయల్స్సిన అవసరం లేదనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య సరసన ” ఏ మాయ చేశావే ” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ. ఈ క్రమంలోనే నాగ చైతన్యను వివాహం చేసుకుని… టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 21, 2021 / 02:22 PM IST
    Follow us on

    Actress Samantha: సమంత గురించి కొత్తగా పరిచయం చేయల్స్సిన అవసరం లేదనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య సరసన ” ఏ మాయ చేశావే ” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ. ఈ క్రమంలోనే నాగ చైతన్యను వివాహం చేసుకుని… టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల వారి వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ తాము విడిపోబోతున్నట్లు ప్రతించిన విషయం తెలిసిందే.  సోషల్ మీడియాలో యాక్టీవ్ గా సామ్ తన ఫొటోస్, వర్క్ కి సంబంధించిన విషయలు మాత్రమే కాకుండా పలు సామాజిక అంశాలపై కూడా  స్పందిస్తుంది సామ్.

    కాగా ఇటీవల రైతు చట్టాల రద్దుపై సీఎం కేసీఆర్‌ బీజేపీ సర్కార్‌ పై పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాలపై చాలా ఆలస్యంగా కేంద్రం స్పందించిందని కెసిఆర్ అన్నారు. రైతులపై దేశ ద్రోహ కేసులను కొట్టివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే  చనిపోయిన 750 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం రూ.3 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్‌. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా 750 మంది రైతులకు ఒక్కక్కరికి రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తాజాగా కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ పై సమంత స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తన మద్దతు తెలుపుతున్నట్లు దండం పెట్టిన ఏమోజీని పెట్టి రీట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియా లో  వైరల్‌ గా మారింది.

    https://twitter.com/Samanthaprabhu2/status/1462296323059638280?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1462296323059638280%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fmanalokam.com%2Fnews%2Fsamantha-sensational-post-on-minister-ktr-tweete2808c.html