Apples: రోజు ఒక ఆపిల్ తింటే చాలు వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అసవరం ఉండదని చెబుతుంటారు. ఆపిల్ కు ఉన్న విలువ అలాంటిది. పండ్లు తింటే ఎంతో ప్రయోజనమని తెలియడంతో వాటిని తినేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. కానీ ఇటీవల కాలంలో పండ్లపై వాడే రసాయనాలతో పండ్లు రంగులుగా కనిపిస్తున్నా అవి తినడం వల్ల అనర్థాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి వ్యాపారులు రసాయనాలతో రంులు వేస్తున్నారు. దీంతో ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆపిల్స్ విషయంలో రంగుల ప్రభావం ఎక్కువ కావడంతో పలు రోగాల బారిన పడుతున్నారు.

ఆపిల్స్ హిమాచల్ ప్రదేశ్, బెంగుళూరు నుంచి ఎక్కువగా ఆపిల్స్ రవాణా అవుతుంటాయి. దీంతో ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు రంగులు కలిపిన రసానాలను పైన చల్లి వాటిని భద్రపరుస్తున్నారు బూట్లకు వాడే పాలిష్ తరహా రసాయనాలు పండ్లపై చల్లుతున్నారు. దీంతో ఇవి నిగారింపుగా కనిపిస్తున్నాయి. వ్యాపారులే రంగులు పూసి ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. దీంతో వాటిని ప్రజలకు అంటగట్టేందుకు సిద్ధపడుతున్నారు. వీటితో ఆరోగ్యం పాడైపోయే ప్రమాదం పొంచి ఉంటోంది.
రసాయనాలు పూసిన ఆపిల్స్ తిన్న ప్రజల ఆరోగ్యం పాడైపోతోంది. పట్టణాల్లో వీటిని విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని పిల్లలకు తినిపించడం వల్ల వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కేన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఇలా ఇష్టారీతిగా పండ్లు విక్రయిస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. వ్యాపారుల మీద కనీస చర్యలు తీసుకోవడం లేదు. దీంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారాలు విస్తరిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

రసాయనాలు చల్లే పండ్లతో రోగాలు వ్యాపించే ప్రమాదమున్నా అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారనే వాదనలు వస్తున్నాయి. రసాయనాలు వాడిన వాటిని తినడం వల్ల రోగాలు సోకే ప్రమాదం ఉంది. వీటిని తినే ముందు నీటిలో ఉప్పువేసి కడిగిన తరువాత తినాలి. లేదంటే రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. దీంతో ఆపిల్ లను తినే ముందు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనకు నష్టాలే రానున్నాయి. ఆపిల్ లు తినటానికి ముందే వాటిని శుభ్రం చేసుకుని తినడానికి చొరవ తీసుకుంటే మంచిది.