Cashew: ఈ సమస్య ఉన్నవారు జీడిపప్పు అస్సలు తినకూడదు

కిడ్నీ సమస్యలు ఉన్న వారు కూడా జీడిపప్పును అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పులో ఎక్కువగా ఫాస్పరస్ ఉంటుందని, కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ఇది మంచిది కాదని తెలియజేస్తున్నారు.

Written By: Suresh, Updated On : January 4, 2024 5:30 pm

Cashew

Follow us on

Cashew: సాధారణంగా నట్స్ అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తాయి. చిన్నారులకు కానీ పెద్ద వారికి కానీ ఆరోగ్యంగా ఉండాలని నట్స్ ను రకరకాలుగా నట్స్ ను తీసుకుంటారు. ముఖ్యంగా బాదం పప్పు, జీడి పప్పు వంటి వాటిని కొందరు రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. జీడిపప్పు తినడానికి రుచికరంగా ఉంటుందని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జీడిపప్పుకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి? జీడిపప్పును ఎందుకు తినకూడదనే విషయాన్ని మనం కూడా తెలుసుకుందాం.

సాధారణంగా మనలో చాలా మంది అలర్జీతో బాధపడుతుంటారు. అటువంటి వారు జీడిపప్పులు తినకూడదట. జీడిపప్పు తిన్న వెంటనే అలర్జీ సమస్యఎక్కువ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటిలో అలర్జీలను పెంచే గుణం ఎక్కువగా ఉంటుందని, అందుకే జీడిపప్పుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.కనుక అలర్జీలతో బాధపడేవారు జీడిపప్పును తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.

అలాగే కిడ్నీ సమస్యలు ఉన్న వారు కూడా జీడిపప్పును అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పులో ఎక్కువగా ఫాస్పరస్ ఉంటుందని, కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ఇది మంచిది కాదని తెలియజేస్తున్నారు. జీడిపప్పులు తింటే కనుక ఆక్సలేట్స్ ఏర్పడతాయి. ఇవి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్
ఉన్నవారు అసలు జీడిపప్పును తినకుండా ఉంటేనే మంచిదని నిపుణులు తెలిపారు.

అదేవిధంగా హై కొలెస్ట్రాల్ ఉన్నవారు కూడా జీడిపప్పును తినకూడదు. జీడిపప్పులో కేలరీలు కూడా అధికంగా ఉంటాయి. దీని వలన జీడిపప్పు తింటే అధికంగా బరువు పెరుగుతారు. ఇందులో ప్రధానంగా వాటిని ఫ్రై చేసి తీసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందుకే హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు కూడా జీడిపప్పుకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ ఈ సమస్యలు ఉన్నవారు కనుక జీడిపప్పును తినాలని భావిస్తే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.