Homeలైఫ్ స్టైల్Peanuts Side Effects: ఈ సమస్యతో బాధపడే వారు వేరుశనగకు దూరంగా ఉండాల్సిందే...?

Peanuts Side Effects: ఈ సమస్యతో బాధపడే వారు వేరుశనగకు దూరంగా ఉండాల్సిందే…?

Peanuts Side Effects: వేరుశెనగలు తినడానికి ఇష్టపడని వారంటూ ఎవరుంటారు చెప్పండి. శీతాకాలంలో చలికి వేరు శనగలు తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటాయి. ఈ క్రమంలోని వీటిని వేయించి ఉప్పు కారం కలిపి తినడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అయితే తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి కనుక చాలామంది ఎక్కువ మోతాదులో వేరుశెనగ తినడం వల్ల ఎన్నో Health Tips in Telugu సమస్యలు తలెత్తుతాయి.ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు వేరుశనగను అసలు తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు. మరి వేరుశనగ అధికంగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?ఏ సమస్యలతో బాధపడేవారు వేరుశెనగ దూరంగా ఉండాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

Peanuts Side Effects
Health tips telugu

సాధారణంగా వేరుశనగను పేదవారి బాదం అని పిలుస్తారు. ఇందులో ఐరన్ క్యాల్షియం మెగ్నీషియం విటమిన్లు వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే వేరుశెనగ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అధికంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎక్కువ మొత్తంలో వేరుశెనగ తినడం వల్ల చర్మ అలర్జీలకు కారణమవుతుంది. అలాగే నోటి పుండ్లు, చర్మంపై దద్దుర్లు ఏర్పడటం జరుగుతుంది. ఇకపోతే అసిడిటీ సమస్యతో బాధపడేవారు వేరుశెనగ కు దూరంగా ఉండాలి.

Also Read: Weight Loss: బరువు తగ్గడం కోసం తిండి మానేస్తున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్?

వేరుశెనగ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తి మలబద్ధకాన్ని కలిగిస్తాయి. అందుకోసమే జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు వేరుశనగకు దూరంగా ఉండాలి.అదేవిధంగా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు వేరుశెనగలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగలో లెక్టిన్‌లను ఉండటం వల్ల నొప్పి లేదా మంటను మానిఫోల్డ్ పెంచుతుంది. అలాగే కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు కూడా వేరుశెనగకు దూరంగా ఉండాలి. వేరుశెనగ అధికంగా తినడం వల్ల అఫ్లాటాక్సిన్ పరిమాణం పెరిగి కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది కనుక వీలైనంత వరకు వేరుశనగను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

Also Read: Chanakya Niti: భర్తలు భార్యలకు చెప్పకూడని విషయాలు ఏమిటో తెలుసా?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version