https://oktelugu.com/

Unstoppable Show: బాలయ్య “అన్ స్టాపబుల్” షో కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు…

Unstoppable Show: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు ఆహాలో అన్ స్టాపబుల్ అనే టాక్ షోను చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ టాక్ షో కు మొదటి అతిథిగా మంచు మోహన్ బాబు, లక్ష్మీ మంచు, అలాగే మంచు విష్ణు హాజరయ్యి ఎంతో సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందించారు. ఈ ప్రత్యేక […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 6, 2021 / 09:15 AM IST
    Follow us on

    Unstoppable Show: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు ఆహాలో అన్ స్టాపబుల్ అనే టాక్ షోను చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ టాక్ షో కు మొదటి అతిథిగా మంచు మోహన్ బాబు, లక్ష్మీ మంచు, అలాగే మంచు విష్ణు హాజరయ్యి ఎంతో సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందించారు. ఈ ప్రత్యేక టాక్‌షోకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో ఈ షో సంచలనం సృష్టించినట్లు ఇటీవల ‘ఆహా’ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ ఓటీటీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.

    Also Read: అసలు నీ బాధేంటి సమంత… గుమ్మడికాయల దొంగ ఎవరంటే..!

    ఇప్పటి వరకు ఈ షోలో మోహన్‌బాబు, నాని, అతిధులుగా హాజరైన విషయం తెలిసిందే. కాగా త్వరలోనే కామెడీ కింగ్ బ్రహ్మానందం, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి సందడి చేయనున్నారు. ఇక త్వరలోనే ప్రేక్శకులను ఉర్రూతలూగించే ఆసక్తికర న్యూస్ ఒకటి ఈ షో కి సంబంధించి వైరల్ గా మారింది. బాలయ్య షో లో సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేయనున్నారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించి షూటింగ్‌ కూడా పూర్తయిందని తెలుస్తుంది. బాలకృష్ణతో మహేష్‌ బాబు సరదాగా మాట్లాడుతున్న ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.  త్వరలోనే ఈ ఎపిపోడ్‌ ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది. అయితే బాలకృష్ణ, మహేష్‌బాబు కలిసి ఓ టాక్‌షోలో కనిపించడం ఇదే తొలిసారి. వీరిద్దరి మధ్య ఫన్‌ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. బాలయ్య ఇటీవల నటించిన అఖండ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ నటవిశ్వరూపం చూపించారు.

    Also Read: Akhanda: బాలయ్య “అఖండ” చిత్రాన్ని వీక్షించిన అఘోరాలు…