https://oktelugu.com/

Palmistry: మీచేతిలో ఈ ఆకారం ఉందా? ఇక మీకు తిరుగులేదు..

అరచేతిలో రకరకాల గీతలు ఉంటాయి. వీటితో పాటు ఎన్నో గుర్తులు, సింబల్స్ ఉంటాయి. కొందరికి ఎమ్ అనే ఆకారం ఉంటే మరికొందరికి ఎక్స్ అనే ఆకారం ఉంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 12, 2024 / 02:50 PM IST

    Palmistry

    Follow us on

    Palmistry: సాధారణ మనుషుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు జ్యోతిష్యాన్ని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. తమ జీవితం ఎలా ఉండబోతుంది? చదువు, ఉద్యోగం, పెళ్లి, సంపాదన, వ్యయం అంటూ ప్రతి విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటారు. అయితే ఇలాంటివి తెలుసుకోవడం జాతకాల వల్లనే అవుతుంది. అయితే కొందరు ఈ విషయాన్ని నమ్మితే మరికొందరు కొట్టి పారేస్తుంటారు. ఇక జాతకం చెప్పాలంటే కొందరు పేరు, జన్మనామంతో చూస్తారు. కానీ కొందరు చేతి రేఖల ద్వారా కూడా జాతకం చెబుతారు.

    అరచేతిలో రకరకాల గీతలు ఉంటాయి. వీటితో పాటు ఎన్నో గుర్తులు, సింబల్స్ ఉంటాయి. కొందరికి ఎమ్ అనే ఆకారం ఉంటే మరికొందరికి ఎక్స్ అనే ఆకారం ఉంటుంది. రీసెంట్ ఎమ్ ఆకారం ఉంటే అర్థం ఏమిటి అని వివరంగా తెలిసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ ఆకారం గురించి తెలుసుకుందాం. ఈ ఆకారం ఉన్న వారికి లైఫ్ లో తిరుగు ఉండదట. ఇలాంటి గుర్తు ప్రపంచం మొత్తంలో కేవలం ఐదు శాతం మందికి మాత్రమే ఉందట. ఈ గుర్తు అందరికీ ఉండది అంటున్నారు జ్యోతిష్యులు.

    అరచేతిలో ఎక్స్ గుర్తు ఉంటే వారు చాలా ప్రతిభావంతులుగా మారుతారట. వీరు సక్సెస్ గా ఉంటూ ఇతరులను కూడా అదే బాటలో నడిపిస్తారట. కేవలం ఇంటిని, ఊరును మాత్రమే కాదు ప్రపంచాన్ని జయిస్తారట ఈ ఎక్స్ ఆకారం ఉన్న వ్యక్తులు. మరి ఈ గుర్తు ఉన్న వారి గురించి తెలిస్తే ఇది నిజమే అనుకుంటారు. ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ చేతిలో కూడా ఈ ఆకారం ఉందట. అలెగ్జాండర్ తన అరచేతిలోని రేఖలను చాలా నమ్మేవారట కూడా. అయితే మాస్కోలో ఉండే సైంటిస్టులు ఈ అరచేతి రేఖల మీద పరిశోధనలు చేశారు.

    అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ కు, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ల అరచేతిలో కూడా ఈ ఎక్స్ గుర్తు ఉంటుంది అని తెలుస్తోంది. అంటే అరచేతిలో ఎక్స్ గుర్తు ఉంటే వారికి తిరుగులేదని, వారు జీనియస్ అని, బలవంతులు అని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. వీరిని మోసం చేయడం కూడా చాలా కష్టమే. ఇక ఎక్స్ గుర్తు ఉంటే శారీరకంగా, మానసికంగా బలవంతంగా ఉంటారట.