Hyundai New Car: ప్రముఖ కార్ల కంపెనీ హ్యాందాయ లేటేస్టుగా కొత్త కారును వినియోగదారులకు పరిచయం చేసింది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ కార్లు ఆకట్టుకున్నాయి. తాజాగా గ్రాండ్ i10 నుంచి ఈ గురువారం పరిచయం చేసింది. లేటేస్ట్ ఫీచర్లతో పాటు ఆకట్టుకునే ధరతో అందుబాటులోకి రావడంతో ఆసక్తిగా మారింది. ఇంజిన్ తో పాటు సేప్టీ ఫీచర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఇంజిన్ విషయానికొస్తే 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటేడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 82 బీహెచ్ పీ పవర్ తో పాటు 112 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. గ్రాండ్ ఐ10 లో ఆకర్షణీయమైన ఎల్ ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ను అమర్చారు. 15 అంగుళాల డ్యూయెల్ టోన్ స్టీల్ వీల్స్ ను కలిగి ఉన్నాయి. ఫుట్ వెల్ టైలింగ్, ఫ్రంట్ రూమ్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి.
సేప్టీ విషయంలోనూ ఈ కారు బెస్ట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో బ్లూ టూత్ కనెక్టివిటితో 4 స్పీకర్లతో 17.14 సెంటమీ మీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటో ఆప్ డౌన్ డ్రైవర్ విండో, అధునాతన ఏసీ, ప్యాసింజర్ వానిటీ మిర్రర్, అరుదైన పవర్ అవుట్ ఫుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
గ్రాండ్ ఐ 10 కొత్త మోడల్ ధర విషయానికొస్తే .. మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్ రూ.6.99 లక్షలు కాగా.. ఆటోమేటిక్ గేర్ బాక్స్ రూ.7.58 లక్షలు గా ఉంది. ఇందులో 5గురు వ్యక్తులు సౌకర్యవంతంగా ప్రయాణిస్తారు. కొత్త వెర్షన్ టెయిల్ గేట్ పై ‘కార్పొరేట్ ’ లోగోతో వినూత్నమైన కలర్లలో అందుబాటులో ఉంది. టైటాన్ గ్రే, టీల్ బ్లూ, ఫైరీ రెడ్ వంటి కలర్లు ఉన్నాయి. ఈ కారు డిజైన్ పరంగా అద్భుతంగా ఆకట్టుకుంటుంది.