Jobs: హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 135 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం.

18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఓబీజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా విభాగాలతో పాటు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఎండీ/ఎంఎస్/డీఎన్బీలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.1,25,000 వేతనంగా లభించనుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తెలంగాణ/ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిష్టర్ కావడంతో పాటు ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 52,000 రూపాయల వరకు వేతనంగా లభించనుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఆఫ్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. http://osmaniamedicalcollege.org/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉండగా ఏప్రిల్ 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.
Also Read: Alia Bhatt And Ranbir Kapoor: ‘అలియా భట్’తో పెళ్లి పై స్టార్ హీరో రియాక్షన్