Online Shopping Frauds: ఈ నంబర్ కు కాల్ చేస్తే మనకొచ్చే కాల్స్ వేరే వాళ్లకు వెళ్లిపోతాయి.. జాగ్రత్త

ఏదైనా ఒక వస్తువును ఆన్ లైన్లో బుక్ చేస్తాం.. ఆ వస్తువు ఇంటికి వచ్చే సరికి మనం అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో డెలీవరి బాయ్ దానిపై ఉన్న నెంబర్ కు కాల్ చేస్తాడు. జన్యూ అయితే సరైన విధంగా కాల్ చేసిన వస్తువులను డెలివరీ చేస్తాడు.

Written By: Srinivas, Updated On : November 18, 2023 9:17 am

online shopping frauds

Follow us on

online shopping frauds: కొన్ని వస్తువులు షాపులోకి వెళ్లి తెచ్చుకోవడానికి సమయం ఉండదు. మరికొన్నింటికి ఆఫర్స్ ప్రకటించడం ద్వారా ఆన్లైన్లో ఎక్కువగా వస్తువులు కొనాలని చూస్తాం.. అయితే చాలా మంది ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులు చాలా వరకు మోసపోయిన సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. ఆన్ లైన్ లో వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఒకదానికి బదులు మరొకటి వచ్చిందని కాంప్లయింట్స్ చాలానే వచ్చాయి. అలాగే ఫేక్ వస్తువులు రావడంతో ఆన్లైన్లో వస్తువులు కొనాలంటేనే భయపడుతున్నారు. అయితే ఈ కామర్స్ కంపెనీలు ఎప్పటికప్పుడు తాము వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తున్నామని చెబుతున్నాయి. కానీ ఇప్పుడు కొత్త రకం మోసం చేస్తున్నారు. అదేంటంటే?

ఏదైనా ఒక వస్తువును ఆన్ లైన్లో బుక్ చేస్తాం.. ఆ వస్తువు ఇంటికి వచ్చే సరికి మనం అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో డెలీవరి బాయ్ దానిపై ఉన్న నెంబర్ కు కాల్ చేస్తాడు. జన్యూ అయితే సరైన విధంగా కాల్ చేసిన వస్తువులను డెలివరీ చేస్తాడు. కానీ కొందరు మోసగాళ్లు కొత్త ట్రిక్ ను ప్రయోగం చేస్తున్నారు. కాల్ చేయకున్నా చేశామని చెబుతూ తిరిగి కాల్ చేయమని చెబుతున్నారు. ఇదే సమయంలో సాధారణ నెంబర్ కు కాకుండా కొత్త నెంబర్ కు ఫోన్ చేయాలంటున్నారు.

*040* టైప్ చేసి ఫోన్ నెంబర్ కొట్టాలని చెబుతారు. అలా చేస్తేనే వస్తువులు డెలివరీ అవుతాయి అని చెబుతారు. దీంతో కొంత మంది అవగాహన లేకపోవడంతో ఈ నెంబర్ ను డయల్ చేస్తారు. అయతే ఈ నెంబర్ ను ‘Forwarding Scam Number’ అని అంటారు. ఇలా *040* టైప్ చేసి ఎవరి ఫోన్ నెంబర్ టైప్ చేస్తామో.. ఆదే నెంబర్ కు టైప్ చేసిన వారి వివరాలు వెళ్తాయి. ఆ తరువాత వీరు ఆ నెంబర్ ద్వారా హ్యాక్ చేసి బ్యాంకు నుంచి లావాదేవీలు నడుపుతారు.

అందువల్ల ఆన్ లైన్ లో వస్తువులు కొనేవారు డెలివరి చేసే బాయ్ ఏ నెంబర్ కొట్టమన్నా స్పందించకండి. మీకు ఫోన్ చేసినప్పుడు ఏదైనా ప్రత్యామ్నాయంగా డెలివరీ చేసుకునేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకోండి. ఈరోజల్లో కొని ఈ కామక్స్ కంపెనీలు వస్తువుల ప్యాకింగ్ నుంచి డెలివరీ వరకు మెసెజ్ లు పంపిస్తున్నాయి. ఈ మెసేజ్ ని ఫాలో అవుతూ వస్తువులను తీసుకోవడానికి అందుబాటులో ఉండేందుకు ప్రయత్నించండి.