Rahul Dravid: వరల్డ్ కప్ కి ముందు విమర్శించారు కానీ ఇప్పుడు నువ్వే తోపు అంటున్నారు

వరల్డ్ కప్ టోర్నీ ఆడటానికి ముందు ఇండియన్ టీమ్ లో నెంబర్ 4లో ఆడే శ్రేయాస్ అయ్యర్ , నెంబర్ 5 లో ఆడే రాహుల్ ఇద్దరు కూడా గాయాల బారిన పడి ఉన్నారు.ఇక ఇండియన్ టీం లో నెంబర్ ఫోర్, నెంబర్ ఫైవ్ ప్లేస్ లో ఆడే ప్లేయర్లు లేరు.

Written By: Gopi, Updated On : November 18, 2023 10:10 am

Rahul Dravid

Follow us on

Rahul Dravid: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీం అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తు ప్రస్తుతం ఫైనల్ కి చేరుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీం తమదైన రీతిలో మ్యాచ్ లను ఆడటమే కాకుండా అభిమానుల్లో కూడా కొండంత ధైర్యాన్ని నింపుతూ ఫైనల్ లో ఆస్ట్రేలియన్ టీం ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది. ఇక ఇలాంటి క్రమంలో ఒక్కసారి కనక మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఈ టోర్నీ కి ముందు ఇండియన్ టీమ్ మీద చాలా విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే ఒక్క అపజయాన్ని కూడా పొందకుండా వరుసగా విజయాలను అందుకుంటూ ఇండియన్ టీం టోర్నీ లో ఎవ్వరికీ సాధ్యం కాని రీతి లో ఒక రికార్డ్ ని నెలకొల్పింది.

అయితే వరల్డ్ కప్ టోర్నీ ఆడటానికి ముందు ఇండియన్ టీమ్ లో నెంబర్ 4లో ఆడే శ్రేయాస్ అయ్యర్ , నెంబర్ 5 లో ఆడే రాహుల్ ఇద్దరు కూడా గాయాల బారిన పడి ఉన్నారు.ఇక ఇండియన్ టీం లో నెంబర్ ఫోర్, నెంబర్ ఫైవ్ ప్లేస్ లో ఆడే ప్లేయర్లు లేరు.ఇక మిడిల్ ఆర్డర్ కూడా చాలా వీక్ గా ఉంది అన్నట్టుగా చాలా రకాల కామెంట్స్ వచ్చాయి.ముఖ్యంగా మన సీనియర్ ప్లేయర్లతో సహా, విదేశాలలో ఉన్న మాజీ ప్లేయర్లు అందరూ ఇండియన్ టీమ్ ని విమర్శించడం మొదలుపెట్టారు.
కానీ వాటిని పట్టించుకోకుండా కూల్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ మాత్రం ఎక్కడ కూడా అధైర్య పడకుండా చాలా కూల్ గా ఉన్నాడు ఇక ఇండియన్ టీం లోకి అయ్యర్ ప్లేస్ లో ఇషాన్ కిషన్, రాహుల్ ప్లేస్ లో సంజు శాంసాన్ని తీసుకోమని చాలామంది సలహాలు కూడా ఇచ్చారు.

కానీ వాటిని రాహుల్ ద్రావిడ్ పట్టించుకోకుండా మైండ్ లో ఉన్న తన గేమ్ స్ట్రాటజీ ని ఎవ్వరికీ చెప్పకుండా కామ్ గా ఉన్నాడు.ఇక అలాగే శ్రేయాస్ అయ్యర్ , కె ఎల్ రాహుల్ ఇద్దరు కోలుకుంటారని కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి వరల్డ్ కప్ ముందే వాళ్ళు కోలుకోవడం ఇండియన్ టీం లోకి రావడం వరల్డ్ కప్ లో మంచి ఫామ్ ని కనబరుస్తూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఇండియన్ టీం ఫైనల్ కి చేరుకోవడం లో కీలకపాత్ర వహించడం చూసిన ప్రతి అభిమాని కూడా రాహుల్ ద్రావిడ్ కి సెల్యూట్ చేయకుండా ఉండలేకపోతున్నారు. ఇన్ని రోజుల నుంచి ఆయన స్ట్రాటజీని మైండ్ లోనే ఉంచుకొని ఎవరికి సమాధానం చెప్పకుండా కామ్ గా ఉన్నాడు…

మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు చాలామంది చాలా సలహాలు ఇస్తారు. వాటిని పట్టించుకోకుండా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దానిమీద ఎక్కువ ఫోకస్ పెడితే విజయం అనేది దానంతట అదే వస్తుంది. అనడానికి రాహుల్ ద్రావిడ్ పాటించిన నియమాలను మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు…