Illegal Relationship: 2021 సంవత్సరంలో హైదరాబాద్ లో జరిగిన హత్యలను పరిశీలిస్తే పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. హత్యల్లో ఎక్కువగా అక్రమ సంబంధాలతో జరిగినవే అని తెలుస్తోంది. 2020తో పోల్చుకుంటే 2021లో వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన హత్యలు రెట్టింపు కావడం గమనార్హం. జరిగిన హత్యల్లో క్రూరంగా జరిగినవే ఎక్కువగా ఉన్నాయన్నది సత్యమే. 2021లో 85 హత్యలు చోటుచేసుకున్నాయి. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా వివాహేతర సంబంధాలే కారణం కావడం తెలుస్తోంది.

గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. గత ఏడాది 64 హత్యలు నమోదయ్యాయి. 2019లో 84 హత్యలు చోటుచేసుకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులే హత్యలకు సహకరించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో నిగ్గు తేల్చే నిజాలు వెల్లడయ్యాయి. దీంతో హత్యల పరంపరలో వివాహేతర సంబంధాలే కీలకం కావడం తెలిసిందే.
Also Read: మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. రూ.50కే మూడేళ్ల వారంటీతో ఐదు బల్బులు!
దాదాపు 60 శాతం కేసుల్లో వివాహేతర సంబంధాలే కారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో కుటుంబీకులే ప్రధాన పాత్రధారులుగా ఉంటున్నారు. భర్తో, భార్యో తన జీవిత భాగస్వామిని కడతేర్చేందుకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. అక్రమ సంబంధం కలిగి ఉన్న వ్యక్తిని చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధం వెలుగు చూడటంతో పలు మార్లు హెచ్చరికలు చేసినా మారకపోవడంతో ఇక చంపడమే శరణ్యమనే భావనకు వస్తున్నట్లు తెలుస్తోంది.
నగరంలో కొన్ని గ్యాంగ్ వార్ లు సుపారీ తీసుకుని హత్యలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు విచారణలో వెల్లడవుతున్నాయి. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే చాలా హత్యలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నింట్లో తీవ్రంగా మరికొన్ని సున్నితంగా జరుగుతున్నాయనేది వాస్తవం. దీంతో వివాహేతర సంబంధాల సందర్భంలోనే పలువురు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై పోలీసులు కూడా సూచనలు చేస్తున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.
Also Read: వామ్మో.. పాన్ కార్డును కలిగి ఉండటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?