RRR Highlights: ‘ఆర్ఆర్ఆర్’లో హైలైట్ ఇంటర్వెల్ కాదు, ఆ సీక్వెన్సే !

RRR Highlights: ‘ఆర్ఆర్ఆర్’ ఇంటర్వెల్ బ్లాక్ గురించి వచ్చినన్ని వార్తలు మరో ఏ టాపిక్ మీద రాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ ఇంటర్వెల్ 16 నిమిషాల పాటు ఉంటుందని, సినిమాలోనే ఇదొక అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ అని, ప్రేక్షకుడి ఇంట్రెస్ట్ ను పీక్స్ కు తీసుకెళ్లే గొప్ప సీక్వెన్స్ అని ఇలా చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందని ఆరా తీస్తే.. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం మెయిన్ […]

Written By: Shiva, Updated On : December 31, 2021 4:27 pm
Follow us on

RRR Highlights: ‘ఆర్ఆర్ఆర్’ ఇంటర్వెల్ బ్లాక్ గురించి వచ్చినన్ని వార్తలు మరో ఏ టాపిక్ మీద రాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ ఇంటర్వెల్ 16 నిమిషాల పాటు ఉంటుందని, సినిమాలోనే ఇదొక అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ అని, ప్రేక్షకుడి ఇంట్రెస్ట్ ను పీక్స్ కు తీసుకెళ్లే గొప్ప సీక్వెన్స్ అని ఇలా చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి.

RRR Highlights

మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందని ఆరా తీస్తే.. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం మెయిన్ గా సినిమాలో వచ్చే హైలైట్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ లో చరణ్ ఎన్టీఆర్ ను అరెస్ట్ చేసే సీక్వెన్స్ అట. ఈ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ మొదలైన పది నిమిషాలకు వస్తోందని.. ఈ సీక్వెన్స్ లోనే ఎన్టీఆర్ – చరణ్ ఫైట్ వస్తోందని తెలుస్తోంది.

సాధారణంగా రాజమౌళి ఇంటర్వెల్ బ్యాంగ్ ను బాగా హై పిచ్ లో ప్లాన్ చేస్తాడు. కానీ, ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ ను మాత్రం ఎమోషనల్ గా ప్లాన్ చేశాడట. అలియాను చరణ్ వదిలేసే సీక్వెన్స్, అలాగే ఎన్టీఆర్ చేతిలోని పాప తలను బ్రిటిష్ సైనికులు నరికేసి షాట్ ను జక్కన్న ఇంటర్వెల్ లో ప్లాన్ చేశాడట. మొత్తానికి ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ బ్యాంగ్ వెరీ ఎమోషనల్ గా ఉండబోతుంది.

Also Read: కాపీ వ్యవహారం పై రాజమౌళి మనసులో మాట !

పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ మల్టీస్టారర్ గా వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఎన్టీఆర్ పై వచ్చే ఫులి ఫైట్ చాలా బాగుంటుందట. కానీ, ఎన్టీఆర్ – చరణ్ ఒకరి పై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తోందని, ఆ దాడికి సంబంధించి వచ్చే యాక్షన్ సీక్వెన్స్ తెలుగు వెండితెర పైనే గొప్ప విజువల్ ఫైట్ గా నిలిచిపోతుందని తెలుస్తోంది.

అయితే, ప్రస్తుతం కరోనా మూడో వేవ్ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో నైట్ క‌ర్‌ఫ్యూ విధిస్తున్నారు. అలాగే థియేట‌ర్ల‌లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌న పెడుతున్నారు. రానున్న వారం రోజుల్లో కూడా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీమ్ లో ఆ భయమే ఎక్కువగా ఉంది.

Also Read: “ఆర్‌ఆర్‌ఆర్” టైటిల్ సీక్రెట్ ఏంటో రివీల్ చేసిన జక్కన్న?

Tags