Omicron Alert: ఒమిక్రాన్ వేరియంట్ అమెరికాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. దీంతో పాజిటివ్ కేసుల్లో 22 శాతం పిల్లల్లోనే కనిపిస్తున్నాయి. గతంలో ఇది ఐదు శాతం లోపే ఉన్నా ప్రస్తుతం పిల్లలనే లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది. అమెరికాలో ఐదేళ్ల చిన్నారులకు కూడా టీకా అందుబాటులోకి తీసుకొచ్చినా ఒమిక్రాన్ వేరియంట్ బారి నుంచి తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.

శాస్ర్తవేత్తలు హెచ్చరించిన విధంగా మూడో దశ ముప్పు వచ్చిందని తెలుస్తోంది. మూడో దశలో చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందని ఇదివరకే చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ తో పిల్లలకే ఎక్కువ ప్రమాదం ఉందని తెలుస్తోంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినా అప్రమత్తత చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. అందుకే వైరస్ వేగంగా విస్తరిస్తోంది.
Also Read: ముంచుకొస్తున్న ఒమిక్రాన్ ముప్పు.. ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలివే?
డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ నాలుగు రెట్లు వేగంగా విస్తరిస్తుందని తెలుస్తోంది. కొవిడ్ పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తే అది మనకే ముప్పు తీసుకొస్తుందని తెలుస్తోంది. అందుకే ప్రజలు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ వైరస్ నుంచి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఎక్కువగానే ఉంది.
భారత్ లో కూడా మూడో దశ ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. ఫిబ్రవరిలో కేసుల సంఖ్య మరింత పెరుగుతాయని తెలుస్తోంది. దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కొవిడ్ మనల్ని వదిలిపెట్టిపోయే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇకపై మనం కరోనాతో కలిసి జీవించాల్సిందేననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు నెలలకోసారి బూస్టర్ డోసు తీసుకుని వైరస్ దాడి చేయకుండా చూసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
Also Read: అమెరికాలో ఒక్కరోజే పది లక్షల కరోనా కేసులా?