https://oktelugu.com/

Om Chant Benefits: ప్రతిరోజూ “ఓం” జపం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?

Om Chant Benefits: అకార, ఉకార, మకార శబ్దాలతో ఓంకారం ఏర్పడిందనే సంగతి తెలిసిందే. ఓంకారంను త్రిమూర్తి స్వరూపం అని కూడా చెబుతారు. ప్రతిరోజూ ఓం అనే పదాన్ని జపించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతుండటం గమనార్హం. ఓం అనే పదాన్ని జపించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ రావడంతో పాటు శక్తి, మానసిక శాంతి లభిస్తాయి. శరీరంను, మనస్సును చైతన్యవంతం చేయడంలో ‘ఓం’ అనే శబ్దం తోడ్పడుతుంది. Also Read: సొంతింటి కల.. సామాన్యుడికి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2021 3:51 pm
    Follow us on

    Om Chant Benefits: అకార, ఉకార, మకార శబ్దాలతో ఓంకారం ఏర్పడిందనే సంగతి తెలిసిందే. ఓంకారంను త్రిమూర్తి స్వరూపం అని కూడా చెబుతారు. ప్రతిరోజూ ఓం అనే పదాన్ని జపించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతుండటం గమనార్హం. ఓం అనే పదాన్ని జపించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ రావడంతో పాటు శక్తి, మానసిక శాంతి లభిస్తాయి. శరీరంను, మనస్సును చైతన్యవంతం చేయడంలో ‘ఓం’ అనే శబ్దం తోడ్పడుతుంది.

    Also Read: సొంతింటి కల.. సామాన్యుడికి గగనమేనా?

    ఓం పదాన్ని ప్రారంభంలో రోజుకు 108 సార్లు జపించాలి. ఉదయం 6 గంటల సమయంలో, మధ్యాహ్నం 12 గంటల సమయంలో, సాయంత్రం 6 గంటల సమయంలో ఓం అనే పదాన్ని జపించవచ్చు. ఈ సమయాన్ని శుభ సమయం అని పిలుస్తారు. నెలకు ఒకసారి 1008 సార్లు ఓం అనే పదాన్ని జపిస్తే మంచిది. ఓం పదాన్ని జపించడం వల్ల సానుకూల శక్తిని పొందే అవకాశంతో పాటు మరింత ఆశాజనకంగా ఉండవచ్చు.

    జ్ఞాపకశక్తిని, ఏకాగ్రత శక్తిని మెరుగుపరచడంలో ఓం పదం తోడ్పడుతుందని చెప్పవచ్చు. కడుపు నొప్పి సమస్యతో బాధ పడేవాళ్లు ఓం పదాన్ని జపిస్తే మంచిది. ఓం పదాన్ని జపించడం వల్ల కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలు దూరమవుతాయి. ప్రతిరోజూ ఓం అనే పదాన్ని జపించడం వల్ల దృష్టి సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. రోజులో సౌలభ్యాన్ని బట్టి ఎన్నిసార్లు అయినా ఓం అనే పదాన్ని జపించవచ్చు.

    om karam

    ఓం పదాన్ని పలకడం వల్ల శరీరంలో కంపనాలు ఏర్పడి సంతోషంగా, ప్రశాంతంగా జీవనం సాగించవచ్చు. ఓం పదాన్ని జపం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఒత్తిడి, ఆందోళనతో బాధ పడేవాళ్లు ఓం అనే పదాన్ని ఉచ్ఛరించడం ద్వారా ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

    Also Read: ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే ఏమవుతుందో తెలుసా.. షాకింగ్ విషయాలు వెల్లడి!