Naga Chaitanya: అక్కినేని వారసుడిగా జోష్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత తన విలక్షణ నటనతో వైవిధ్యమైన కథాంశాలతో తనకంటూ అభిమానులను సొంతం హీరో నాగచైతన్య. తన కెరీర్లో యాక్షన్ చిత్రాల కంటే లవ్ స్టోరీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆయన సినిమాలు చూస్తే ఎవరుకైనా తెలుస్తుంది. దీన్ని బట్టే తెలుస్తోంది చై తన ఫ్యామిలీకి అచ్చొచ్చిన పంథాలోనే వెళ్తున్నాడని.. తొలి చిత్రం ‘జోష్’ మొదలు మొన్న వచ్చిన ‘లవ్ స్టోరీ’ దాకా నాగచైతన్య కెరీర్ లో ప్రేమకథలే కీలక పాత్ర పోషించాయి. ఈ రోజు అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌తో పాటు, వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేద్దాం.
1986 నవంబరు 23న నాగచైతన్య హైదరాబాద్‌లో జన్మించారు. చిన్నతనం నుంచి తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేశ్ లతో ఎక్కువగా కలిసి పెరిగిన చైకు.. అప్పటినుంచే నటుడవ్వాలనే అభిలాష బాల్యం నుంచీ ఉండేది. దానికి తోడు చుట్టూ సినీ వాతావరణమే కనిపించడం ల్ల.. ఒక్కసారైనా సినిమాల్లలో నటించాలనే ఆసక్తిగా అనుకునేవాడు చై. ఈ విషయాన్ని తన తొలి సినిమా జోష్ ఆడియో వేడుకలో స్వయంగా నాగచైతన్యనే చెప్పారు. తొలి చిత్రం జోష్ యావరేజ్ టాక్ అందుకున్నప్పటికీ.. ఏ మాయ చేశావే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో హీరోయిన్గా సమంత నటించింది. చైతూ కెరీర్లోనే తన లైఫ్‌లో కూడా మలుపులు తిప్పిన సినిమాగా ఏ మాయ చేశావే నిలిచిపోయింది.
ఆ తర్వాత వెంటనే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100 పర్సెంట్ లవ్ కూడా నాగ్‌కు మంచి విజయాన్ని అందించింది. అప్పటి నుంచి వరుస చిత్రాలతో ముందుకు దూసుకెళ్లిపోయారు చైతూ. అలా తన జీవితంలో మరుపురాని సినిమాగా నిలిచిపోయిన మనంలో.. మొత్తం ఫ్యామిలీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు చైతూ.
చైతన్య తన కెరీర్లో “ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మహానటి, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి, మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ” వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇప్పటికీ అదే విభిన్న కథాంశాలను ఎంచుకుని ప్రేక్షకులను అలరించేందుకు ముందుకొస్తున్నారు నాగచైతన్య.
కాగా, ప్రస్తుతం థాంక్యూ సినిమాతో పాటు, హిందీలో అమిర్‌ఖాన్ హీరోగా నటిస్తోన్న లాల్‌సింగ్ ఛద్దాలో చైతూ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు నాగచైతన్యతో కలిసి బంగార్రాజులోనూ నటిస్తున్నారు. దీంతో పాటు మనం సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్‌తో కలిసి థ్యాంక్యూ సినిమాలో మెరవనున్నారు.