Rest In Peace: ఇటీవల కాలంలో ఎవరైనా చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అంటూ కామెంట్లు పెట్టడం సాధారణం అయిపోయింది. కానీ హిందూ ధర్మం ప్రకారం రెస్ట్ ఇన్ పీస్ అనకూడదట. ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది. క్రైస్తవులు చనిపోయిన వారిని పాతిపెడతారు. వాళ్లకు తీర్పు వచ్చే రోజు ఒకటి ఉందని నమ్ముతారు.దాని కోసం అప్పుడు చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళతాడా? నరకానికి వెళతాడా? అనేది నిర్ణయిస్తారు. దీంతో తీర్పు వచ్చే వరకు ఆత్మ సమాధిలో ఉంటుంది. అందుకు వారు మళ్లీ లేస్తారనే నమ్మకంతో తీర్పు వచ్చే వరకు ప్రశాంతంగా ఉండాలని రెస్ట్ ఇన్ పీస్ అని వాడతారు.

హిందూ మతంలో చనిపోయిన వారు తిరిగి లేవడం అనేది ఉండదు. మనిషికి పునర్జన్మ ఉంటుందని నమ్ముతుంది. అందుకే మరణించిన వ్యక్తికి కర్మల ఫలితంగా మరో జన్మ ప్రాస్తిస్తుందని మన విశ్వాసం. అందుకే మన ఆత్మకు విశ్రాంతి లేదు. కానీ మోక్షం ఉంటుంది. మోక్షం అంటే విముక్తి. అందుకే మనం రెస్ట్ ఇన్ పీస్ అని వాడకూడదు. ఓం శాంతి, ఓం సద్గతి లేదా విముక్తి అనే మాటలు చెప్పాలనే విషయం తెలుసుకోవాలి.
Also Read: Revanth Rahul vs KCR : టీఆర్ఎస్ సర్కార్ కంబంధ హస్తాల్లో ‘ఓయూ’.. కేసీఆర్ దెబ్బకు రేవంత్ ఫెయిల్?

రెస్ట్ ఇన్ పీస్ అంటే మరో అర్థం ప్రేతాత్మ అని వస్తుంది. ప్రేతాత్మ అంటే భూమి ఉండిపోయేదే. మనిషి చనిపోయిన పదమూడో రోజు హిందువులు ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రేతాత్మను భూమి మీద విడిచిపెట్టి వెళ్లాలని కోరుతారు. మరో జన్మ తీసుకోవాలని ఆశిస్తారు.ఆత్మకు మోక్షం కలగాలని వేడుకుంటారు. అందుకే ఓం సద్గతి అని చెబితే ఆత్మకు మోక్షం కలుగుతుందని భావిస్తారు.
హిందువులు పునర్జన్మను విశ్వసిస్తారు. అందుకే ఆత్మ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటారు. అందుకే హిందూ ధర్మం ప్రకారం రెస్ట్ ఇన్ పీస్ అనకూడదను అని చెబుతారు. కానీ ఎవరికి కూడా అర్థం కాక అదే పదాలను వాడుతూ మన ధర్మాన్ని పాటించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అర్థం చేసుకుని రెస్ట్ ఇన్ పీస్ కాకుండా ఓం సద్గతి అని వాడాలని సూచిస్తున్నారు.
Also Read:Superstar Krishna: తెలుగు మొదటి పాన్ ఇండియా స్టార్ ఆయనే !