https://oktelugu.com/

Sreeleela: ‘శ్రీలీల’ రెట్టింపు అందం కోసం ఇలా చేస్తోందా ?

Sreeleela: క్రేజీ బ్యూటీ శ్రీలీల పుట్టుకతోనే అందగత్తె. అయినప్పటికీ, తన రోజువారీ చర్మ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖం, చర్మంతో పాటు మొత్తం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది శ్రీలీల. బయట దొరికే మేకప్ రసాయనాలు, వివిధ మార్కెట్ ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో చర్మ సంరక్షణను శ్రీలీల ఇష్టపడుతుంది. మరి, ఈ యంగ్ బ్యూటీ తీసకుంటున్న డొమెస్టిక్ కేర్‌ పై ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం. సాధారణంగా సినిమా బ్యూటీలందరూ ఎక్కువగా మేకప్ వాడతారు. కానీ, […]

Written By:
  • Shiva
  • , Updated On : May 5, 2022 5:59 pm
    Follow us on

    Sreeleela: క్రేజీ బ్యూటీ శ్రీలీల పుట్టుకతోనే అందగత్తె. అయినప్పటికీ, తన రోజువారీ చర్మ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖం, చర్మంతో పాటు మొత్తం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది శ్రీలీల. బయట దొరికే మేకప్ రసాయనాలు, వివిధ మార్కెట్ ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో చర్మ సంరక్షణను శ్రీలీల ఇష్టపడుతుంది. మరి, ఈ యంగ్ బ్యూటీ తీసకుంటున్న డొమెస్టిక్ కేర్‌ పై ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.

    Sreeleela

    Sreeleela

    సాధారణంగా సినిమా బ్యూటీలందరూ ఎక్కువగా మేకప్ వాడతారు. కానీ, శ్రీలీల మాత్రం మేకప్ లేకుండానే మెరిసిపోతూ ఉంటుంది. శ్రీలీల నటిగా తెరంగేట్రం చేసిన నాటి నుంచే తనదైన శైలిలో అందంతో.. అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇంతకీ, శ్రీలీల తన స్కిన్ గ్లో కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది.. ? తను సహజంగా అందంగా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలు పాటిస్తుందనే సీక్రెట్లను ఇప్పుడు తెలుసుకుందాం.

    Also Read: KGF 2: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

    మెరిసే చర్మం కోసం శ్రీలీల ఏమి చేస్తోందంటే.. ?

    Actress Sreeleela

    Actress Sreeleela

    ముందుగా శ్రీలీల ఒక టేబుల్ స్పూన్ తేనే, ఒక టేబుల్ స్పూన్ పొప్పడి పండు గుజ్జు, పొప్పడి పండు లేకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ గుజ్జు తీసుకుంటుందట. ఇవి బాగా కలిపిన మిశ్రమాన్ని తన ఫేసుకు అప్లై చేసుకుని.. 15 నిమిషాల వరకు అలా ఉంచుతుందట. అది పొడిగా మారిన తర్వాత శ్రీలీల దాన్ని కడుక్కోమంటుంది. అంతే, ఇలా చేస్తే.. శ్రీలీల వంటి అందమైన చర్మం మీరు సొంతం చేసుకోవచ్చు.

    అందం కోసం శ్రీలీల ఏ ఆహారం తింటుంది అంటే..?

    Sreeleela

    Sreeleela

    శ్రీలీల తన చర్మ సౌందర్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి పచ్చని కూరగాయలు మరియు పండ్లు తింటుంది. శ్రీలీల జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లదు. యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ కార్యాలయాలలో కనిపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అందుకే శ్రీలీల వాటిని ఎక్కువగా ఉంటుంది.

    Also Read:BJP Leader Arrested: పేకాట ఆడుతూ మహిళలతో పట్టుబడ్డ బీజేపీ నేత

    Tags