NILD Recruitment 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకోమోటర్ డిజేబిలిటీస్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. వేర్వేరు సెంటర్లలో పని చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ సంస్థ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 15 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

క్లినికల్ సైకాలజిస్ట్, ఓరియెంటెషన్ అండ్ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్, లెక్చరర్ ఉద్యోగ ఖాళీలతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్, డైరెక్టర్, క్లినికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ1 యూనిట్ పట్నా, స్పీట్ అండ్ హియరింగ్ విభాగాలతో పాటు పీఎం అండ్ ఆర్, క్లినికల్ సైకాలజీ, ఎంఆర్, హెచ్‌ఐ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 25,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. సంస్థ కోల్ కతా అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. 2022 సంవత్సరం మార్చి 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. http://www.niohkol.nic.in/default.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Also Read: సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించాడా? ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో వాళ్లు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు?