https://oktelugu.com/

Cyber Criminals: సైబర్ నేరగాళ్ల కొత్త మోసం.. ఫోన్ ఇస్తే సమాచారం మాయం..

చేతిలోకి మొబైల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తమ పనులను ఈ Gadget ద్వారానే నిర్వహించుకుంటున్నారు. మొబైల్ ద్వారా పనులు చాలా ఈజీగా అవుతాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 16, 2025 / 02:04 PM IST

    Syber-Fraud

    Follow us on

    Cyber Criminals: చేతిలోకి మొబైల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తమ పనులను ఈ Gadget ద్వారానే నిర్వహించుకుంటున్నారు. మొబైల్ ద్వారా పనులు చాలా ఈజీగా అవుతాయి. కానీ జాగ్రత్తగా ఉండకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మొబైల్ పై దృష్టి పెడుతున్నారు. వినియోగదారులు తమ డేటాను ఫోన్లోనే ఎక్కువగా భద్రపరచుకోవడంతో సైబర్ నేరగాళ్లు మొబైల్ ను హ్యాక్ చేసి విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఆ తర్వాత డబ్బును కొల్లగొడుతున్నారు. రోజుకో రకంగా మోసం చేస్తూ మొబైల్ వినియోగదాలను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. తాజాగా కొత్త మోసానికి తెరలేపి వారి సమాచారాన్ని దొంగిలించి ముప్పు తిప్పలు పెడుతున్నారు. అదెలా చేస్తున్నారంటే..?

    ఇప్పటివరకు రకరకాలుగా మొబైల్ వినియోగదారులను మోసం చేసి డబ్బులను దోచుకున్నారు. అయితే పోలీసులు, ఇతర మార్గాల ద్వారా అవగాహన కలగడంతో వినియోగదారులు జాగ్రత్తగా పడుతున్నారు. ఇప్పటివరకు వెబ్సైట్ లింకులు పంపి వాటివి క్లిక్ చేసి రివార్డు పొందాలని చెప్పడంతో చాలామంది అలా లింకు చేసి తమ బ్యాంక్ ఖాతాలోని డబ్బును లాస్ చేసుకున్నారు. మరికొందరు ఓటిపి పంపి వాటిని చెప్పమని చెప్పి సమాచారాన్ని దొంగిలించారు. ఇంకొందరు కేవైసీ అప్డేట్ చేస్తామని చెప్పి బ్యాంకు ఖాతాలోని సమాచారాన్ని తెలుసుకున్నారు.

    ఇటీవల కుటుంబ సభ్యుల కు ఫోన్ చేసి తమ కుమారుడు లేదా కుమార్తె తప్పులు చేశారని బెదిరిస్తూ డబ్బులు లాగేస్తున్నారు. అయితే తాజాగా కొత్త రకంగా మోసం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి ఫోన్ చేసుకోవాలని అడిగితే కచ్చితంగా సాయం చేస్తాం. అది నిజమయి వారి అవసరాలకు కాల్ చేసుకుంటే పర్వాలేదు. కానీ కొందరు అలా ఫోన్ చేసుకుంటామని మొబైల్ తీసుకుని అందులో అనవసరపు యాప్ ను ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా మొబైల్ లోని సమాచారాన్ని తెలుసుకునేందుకు వారి కోడ్ను ఎంట్రీ చేస్తున్నారు. ఆ తర్వాత వారి ఫోన్లు వారికిచ్చి తమ ఫోన్ లోకి సమాచారం వచ్చేలా క్రియేట్ చేస్తున్నారు. దీంతో బాధితులకు ఎటువంటి ఓటీపీలు లేదా బ్యాంకు సమాచారం వచ్చిన వారి సమాచారం అంతా సైబర్ నేరాగాలకు వెళ్లిపోతుంది. అందువల్ల ఇతరులకు మొబైల్ ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ నిజంగానే వారి అవసరం కొద్దీ కుటుంబ సభ్యులకు కాల్ చేయాలని అడిగితే వారి నెంబర్ ని మీరే ఎంట్రీ చేసి ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. లేక పోతే వారికి మొబైల్ ఇచ్చి మీరు వేరే మాట్లాడటం వల్ల మొబైల్ లోని సమాచారం అంతా వారు సేకరిస్తారు. దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది అని పోలీసులు తెలుపుతున్నారు.

    అంతేకాకుండా మొబైల్ వాడకంలోనూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. విలువైన సమాచారాన్ని ప్రయాణాలు చేసే సమయంలోనూ లేదా జనం మధ్యలో మాట్లాడుకోవద్దని తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులతో అత్యవసర సమాచారాన్ని నేరుగా మాట్లాడుకోవాలని.. అత్యవసరమైతే ఫోన్లో మాట్లాడాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక మొబైల్లో ఏ కొత్త యాప్ కనిపించిన వెంటనే వాటిని డిలీట్ చేయడం మంచిదని పోలీసులు తెలుపుతున్నారు.