https://oktelugu.com/

Coming to Sankranti : ‘సంక్రాంతికి వస్తున్నాం’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి..మొదటి రోజుతో సమానమైన వసూళ్లు!

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' ఇటీవలే భారీ అంచనాల నడుమ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 16, 2025 / 02:05 PM IST

    Coming to Sankranti

    Follow us on

    Coming to Sankranti : విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇటీవలే భారీ అంచనాల నడుమ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ సినిమా సూపర్ హిట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి ఏ రేంజ్ లో క్యూలు కడుతారో మరోసారి ఉదాహరణగా నిలిచింది ఈ చిత్రం. గత రెండు రోజుల నుండి ఈ సినిమాకి థియేటర్స్ లో దొరకడం చాలా కష్టం గా మారింది. ఈరోజు టికెట్స్ దొరకకపోతే, రేపటికి అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకొని వెళ్తున్నారు. బుక్ మై షో లో గంటకి 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోవడం వంటివి ఈరోజుటికి అనుకుంటే పెద్ద పొరపాటే. రేపటికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అవి. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రం మూడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా ఈ స్టోరీ లో చూద్దాం.

    కృష్ణ జిల్లాలో ఈ చిత్రానికి మొదటి రోజు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు కూడా అదే రేంజ్ షేర్ వసూళ్లు రావడం అందరినీ షాక్ కి గురి చేసింది. అలా రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే భారీ వసూళ్లను సాధించిన చిత్రం గా నిల్చింది. అదే విధంగా నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మొదటి రోజు ఇక్కడ 4 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సీడెడ్ లో రెండవ రోజు దాదాపుగా మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర ప్రాంతం లో 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. కేవలం ఈ నాలుగు ప్రాంతాల నుండి ఈ చిత్రానికి పది కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి.

    ఓవరాల్ గా రెండవ రోజున ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 41 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 33 కోట్ల రూపాయలకు జరిగింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కు ని పొంది, ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు ని నెలకొల్పాడు విక్టరీ వెంకటేష్. ఇలా రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఏకైక హీరో ఆయన మాత్రమే. రాబోయే రోజుల్లో కూడా ఈ రికార్డుని ఎవ్వరూ బ్రేక్ చేయలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దశాబ్దాలు దాటినా ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ పవర్ ఇసుమంత కూడా తగ్గలేదని మరో ఈ చిత్రం నిరూపించి చూపించింది.