https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ మూవీ లో ఈ ఒక్కటి మారిస్తే సినిమా సూపర్ సక్సెస్ అయ్యేదా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో భారీ సినిమాలు వచ్చి మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : January 16, 2025 / 02:00 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో భారీ సినిమాలు వచ్చి మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక రీసెంట్ గా పుష్ప 2 సినిమా పాన్ ఇండియాలో పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోల నుంచి వచ్చే ప్రతి సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే తెలుగు సినిమా స్థాయి అంతకంతకు పెరుగుతూ ఉంటుంది…

    రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధిస్తుంది అంటూ చాలామంది చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేసినప్పటికి సినిమా మొదటి షో తోనే డివైడ్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ హీరోగా చేసిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అనుకున్న వారికి కొంతవరకు నిరాశను మిగిల్చిందనే చెప్పాలి… ఇక దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు 300 కోట్లకు పైన వసూళ్లను రాబట్టింది. మరి ఏది ఏమైనా కూడా శంకర్ చేసిన మిస్టేక్స్ వల్లే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండటం విశేషం…ఇక ఎలక్షన్ కమిషనర్ ఎలాగైతే తన విధులను సిన్సియర్ గా నిర్వర్తిస్తారో ఆ ఒక్క పాయింట్ ను చాలా హైలెట్ చేసి ఈ సినిమాలో చూపించాల్సింది. అలా కాకుండా చరణ్ ఒకసారి స్టూడెంట్ గా మరోసారి ఐపీఎస్ గా ఇంకోసారి ఐఏఎస్ గా అవతారం ఎత్తుతూ ఉంటాడు. ఇలా తను అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి అయిపోతూ డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తూ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయడం వల్ల ఈ సినిమాకి అనుకున్నంత ఆదరణ అయితే రాలేదు.

    అలా కాకుండా మొదటి నుంచి చివరి వరకు రామ్ చరణ్ ఎలక్షన్ కమిషనర్ గా తన డ్యూటీని ఎంత సిన్సియర్ గా చేయబోతున్నాడనేది చూపించి ఉంటే సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి కూడా రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ని చాలా బాగా ఫాలో అవుతూ వచ్చేవాడు. తద్వారా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా శంకర్ మరోసారి కంబ్యాక్ ఇచ్చేవాడు అంటూ చాలామంది సినిమా విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…

    మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం శంకర్ తన పూర్తి ఫామ్ ను కోల్పోయాడు. కాబట్టి ఇక మీదట తనతో సినిమాలు చేయబోయే హీరోలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే కథ విషయంలో శంకర్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

    లేకపోతే మాత్రం విజువల్ గా సినిమాని ఎంత చూపించినా కూడా అందులో కథ లేకపోతే ప్రేక్షకులు ఆదరించే అవకాశం అయితే ఉండదు. ఈ ఒక్క విషయాన్ని గమనించి శంకర్ ముందుకు సాగితే మంచిదని మరి కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…