New Clothes Buying Tips: సమాజంలో మనకు మంచి పేరు రావాలంటే మంచి రూపం ఉండాలని అనుకుంటారు. కానీ రూపం ఎలా ఉన్నా ధరించే దుస్తులు బాగుండాలని కోరుకునే వారు కూడా ఉన్నారు. ఒక వ్యక్తికి మంచి డ్రెస్ వల్ల అందం వస్తుంది. అయితే కొందరు ఎప్పటికీ అందంగా ఉండాలని కోరుకుంటూ ఎక్కువగా డ్రెస్సులు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మహిళలు అయితే చీరలు కొనుగోలు చేయడంలో అడ్డు అదుపు ఉండదు. అయితే కొనుగోలు చేస్తున్న దుస్తుల్లో మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాం? ఎంతవరకు వాటిని వృథా చేస్తున్నాం? కొన్ని నివేదికల ప్రకారం వేలకొద్దీ చీరలు వాడుకోకుండానే వృధా చేస్తున్నారు. వీటివల్ల వాతావరణం కాలుష్యం అవుతుంది. మరి దుస్తులు కొనేటప్పుడు ఎలా ఆలోచించాలి? ఒకవేళ మనం వాడని దుస్తులను ఏం చేయాలి?
కొంతమంది మార్కెట్లోకి కొత్తగా దుస్తులు రాగానే వెంటనే కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఆఫర్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొనుగోలు చేస్తారు. అయితే వాటిని ఒకటి లేదా రెండుసార్లు ధరించి పక్కకు వేస్తారు. అలా అవి పూర్తిగా పాడైపోకుండానే నచ్చలేదని బయటపడేస్తారు. చెత్త తో పాటు వాటిని కూడా బయటపడేయడం వల్ల వాతావరణం కాలుష్యం గా మారుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చే చీరలు, డ్రెస్సులు ఎక్కువగా సింథటిక్, ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారవుతున్నాయి. సాధారణంగా కాటన్ దుస్తులు మట్టిలో కలిసిపోతాయి. కానీ సింథటిక్ కు చెందిన దుస్తులు మట్టిలో కలిసిపోకుండా అలాగే ఉండిపోయి చిన్న చిన్న బాక్టీరియాని విడుదల చేస్తాయి. ఇవి వాతావరణం తో పాటు నీటిలో కలిసిపోతాయి. ఈ నీటిని మనసులు వాడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి దీనిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా..? అంటే పెద్దగా పట్టించుకోవు. అయితే క్రమ పద్ధతిలో ఇలాంటి అవసరం లేని దుస్తులను మనమే దూరం చేసుకోవాలి.
అవసరం లేని దుస్తులు కొనుగోలు చేయకుండా.. అవసరం ఉన్నవి మాత్రమే అవి కూడా ధరించాలని అనుకుంటేనే కొనుగోలు చేయాలి. అంతేకాకుండా ఒక్కోసారి అవసరం లేని దుస్తులు కొనుగోలు చేసి వాటిని వాడకపోయిన పక్షంలో ఇతరులకు దానం చేయాలి. లేదా ఒక బాక్స్ లో ఉంచి స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలి. అలాగే చెత్తను సేకరించి వారికి కూడా ఇస్తే వారు ఇతరులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మరోసారి అనవసరమైన దుస్తులు కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉండదు. అంతేకాకుండా ఆన్లైన్లోనూ వాడిన దుస్తులను కొనుగోలు చేసే సంస్థలు ఉంటాయి. వాటికి విక్రయించడం వల్ల ఎంతో కొంత డబ్బు వస్తుంది.
అయితే ఇంత ప్రాసెస్ చేసే బదులు.. బట్టలు కొనుగోలు చేసే సమయంలోనే ప్రణాళిక వేసుకుంటే ఎలాంటి అదనపు పనులు చేయాల్సిన అవసరం ఉండదు. అంటే అవసరం ఉన్నవి మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. అనవసరంగా.. ఆఫర్ ఉన్న దుస్తులను కొనుగోలు చేయడం వల్ల డబ్బులు వృధా కావడంతో పాటు పర్యావరణానికి హాని కలిగే ప్రమాదం ఉంది..