Navratri 2021: మన దేశంలోని హిందువులు ఘనంగా జరుపుకునే పండుగలలో దసరా పండుగ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీ నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానుండగా భక్తులు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడంతో పాటు పూజలను నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీన దసరా పండుగ కాగా దుర్గామాతను ప్రార్థించే సమయంలో భక్తులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.

నవరాత్రుల సమయంలో కొన్ని పనులు తప్పనిసరిగా చేయాల్సి ఉండగా కొన్ని పనులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. శరన్నవరాత్రులు పవిత్రమైన రోజులు కాగా ఈ రోజులలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. కచ్చితంగా స్నానం చేయడంతో పాటు శుభ్రమైన దుస్తులను ధరించి దేవీ కుటీరంను, పూజగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. తొలి రోజున కలశ స్థాపన చేయడంతో పాటు ఆచారాల ప్రకారం అన్ని పనులు చేయాలి.
దుర్గా సప్తశతిని పఠించడంతో పాటు శ్లోకాలను, దుర్గా మంత్రాలను జపించాలి. ఉపవాసం చేయాలని అనుకుంటే ఆచారాలను పాటించడంతో పాటు స్వీయ నిగ్రహాన్ని కలిగి ఉండటంతో పాటు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. అఖండ జ్యోతి ఎప్పుడూ వెలిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అఖండ జ్యోతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్పకూడదు. మద్యం, మాంసంకు దూరంగా ఉండటంతో పాటు ఉపవాసం ఉన్నవాళ్లు లైట్ ఫుడ్ ను తీసుకోవాలి.
నవరాత్రుల సమయంలో జుట్టు, గోళ్లు కత్తిరించుకోకూడదు. నవరాత్రుల సమయంలో గుండు కూడా చేయించుకోకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడంతో పాటు ధ్యానం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.