National Mental Health Survey : నేటి యువతే రేపటి ఆదర్శ పౌరులు అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే ఈ యువత ఆరోగ్యంగా ఉంటేనే రేపటి తరానికి అన్ని రకాలుగా పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో యువత అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడితో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 15 ఏళ్ల వయసు రాగానే యువత ఏదో రకంగా ఒత్తిడికి గురవుతున్నారు. చదువులోనూ జాబ్ విషయంలోనూ ఇతర సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో National Mental Health Survey (NMHS)నేటి యువతపై పరిశోధన చేసింది. ఈ సంస్థ 2022 చేసిన సర్వే ప్రకారం యువత ఏ రకంగా ఆవేదన చెందుతున్నారో ఇప్పుడు చూద్దాం..
15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల యువత చదువు విషయంలోనూ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి చదువుకోవాలి? కోరుకున్న చదువులో తాను విజయం సాధించగలనా? లేదా? అంటూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో వారు డిప్రెషన్ కి గురై అనేక రకాల మానసికంగా ఘర్షణకు గురవుతున్నారు. NMHS సర్వే ప్రకారం 30 ఏళ్ల లోపు వయసు వారిలో 14.7% మానసిక సమస్యలు ఉన్నట్లు గుర్తించింది. ఈ సమస్యలతో వారు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే కొందరికి నీ ఆలోచనలు వచ్చినా ఇతరుల సహాయంతో బయటపడ్డారు. 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవారు ఉద్యోగం, సామాజిక భద్రత లాంటి విషయాలపై తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచనలో రక్త పోటు, అల్జీమర్ వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే వీరు తమ భద్రత కోసమే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఓవైపు ఆర్థిక వ్యవహారాల్లోనూ.. మరోవైపు కుటుంబ సంబంధాల నేపథ్యంలో తీవ్రంగా ఆలోచన చేస్తూ మానసిక ఘర్షణకు గురవుతున్నారు. ఈ క్రమంలో వారు ఏదో ఒక వ్యాధి బారిన పడుతున్నారు.
Also Read: అఖండ 2తో భారీ రిస్క్ చేస్తున్న బాలయ్య, సాధ్యమయ్యే పనేనా?
అయితే కేంద్ర ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యువత ఆరోగ్యం పై సర్వే నిర్వహించింది. ఈ శాఖ అందించిన ప్రకారం యువతలో ఎక్కువగా గుండెపోటు వస్తున్నట్లు గుర్తించింది. 2020 నుంచి యువతలో ఎక్కువగా గుండె సమస్యలు రావడం ఎక్కువగా మారిందని తెలిపింది. అలాగే 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వారికి ఎక్కువగా మధుమేహం సంక్రమించినట్లు తెలిపింది. వీటికి కారణం ఎక్కువగా ఒత్తిడి, భయాందోళన, ఆర్థిక, సామాజిక భద్రతనే కారణమని తెలిపింది.
అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత తీవ్ర ఆందోళనలో మునిగిపోయే అవకాశం ఉంది. వీటినుంచి బయట పడేందుకు అవగాహన కార్యక్రమాలు అవసరమని కొందరు నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఒక యువత డిప్రెషన్ లోకి వెళ్లినప్పుడు వారి తల్లిదండ్రులు లేదా సంబంధించిన స్నేహితులు ఆ వాతావరణం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. లేదా ఎవరికి వారు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి మానసిక నిపుణులను సంప్రదించాలి. లేకుంటే చిన్నగా ఉన్న సమస్య పెద్దగా మారి ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.