Jobs: నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రైవేట్ సెక్టార్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అయిన నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ కు 5 రాష్ట్రాల్లో 164 శాఖలు ఉన్నాయి. నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలతో పాటు క్లర్క్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
మొత్తం 100 ఉద్యోగ ఖాళీలలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 50 ఉండగా క్లర్క్ పోస్టులు 50 ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేషన్స్‌పై అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 1500 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. https://www.nainitalbank.co.in/english/home.aspx వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి సమాచారంను తెలుసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.