Mutual Funds: ప్రస్తుత కాలంలో చాలామంది కష్టపడకుండా డబ్బు సంపాదించాలని భావిస్తున్నారు. డబ్బు సంపాదనకు వేర్వేరు మార్గాలు అందుబాటులో ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే రాబడిని సొంతం చేసుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ డబ్బులను పొందాలని భావించే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
చిన్న వయస్సులోనే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. రోజుకు కనీసం 100 రూపాయల చొప్పున నెలకు 3,000 రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయి.
Also Read: మోడీతో ఫైట్: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందా?
దీర్ఘకాలిక లక్ష్యాల కొరకు ఇన్వెస్ట్ చేసేవాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎన్ని సంవత్సరాల పాటు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలో ముందుగానే నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు సొంతమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. 25 సంవత్సరాల వయస్సు నుంచే నెలకు 3,000 రూపాయల చొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో కోట్ల రూపాయలు సొంతమవుతాయి.
ఎంచుకునే టెన్యూర్ ను బట్టి మెచ్యూరిటీ మొత్తంలో మార్పులు ఉంటయనే సంగతి తెలిసిందే. మార్కెట్ రిస్క్‌కు లోబడి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్లు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈ విషయాలను కూడా గుర్తుంచుకోవాలి.
Also Read: బీజేపీ చూపు ముద్రగడ వైపు.. పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు?