https://oktelugu.com/

NBK 107: మాసివ్ అవతార్ తో అదరగొట్టిన బాలయ్య

Balakrishna First Look: నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా నుంచి తాజాగా ‘బాలయ్య ఫస్ట్ లుక్’ ను విడుదల చేసింది టీం. బ్లాక్ షర్ట్ వేసుకున్న బాలయ్య… లుంగీతో దర్శనమిచ్చాడు. పైగా బ్లాక్ కారు పక్క నుంచి బాలయ్య అలా నడుస్తూ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. మొత్తానికి బాలయ్య స్టైలిష్ మాసివ్ అవతార్ లో అదరగొట్టాడు. ఇక ఈ పోస్టర్ ను బట్టి మైనింగ్ మాఫియా బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ […]

Written By: , Updated On : February 21, 2022 / 05:45 PM IST
Follow us on

Balakrishna First Look: నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా నుంచి తాజాగా ‘బాలయ్య ఫస్ట్ లుక్’ ను విడుదల చేసింది టీం. బ్లాక్ షర్ట్ వేసుకున్న బాలయ్య… లుంగీతో దర్శనమిచ్చాడు. పైగా బ్లాక్ కారు పక్క నుంచి బాలయ్య అలా నడుస్తూ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. మొత్తానికి బాలయ్య స్టైలిష్ మాసివ్ అవతార్ లో అదరగొట్టాడు. ఇక ఈ పోస్టర్ ను బట్టి మైనింగ్ మాఫియా బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ సినిమా నడిచేలా ఉంది.

Balakrishna First Look

Balakrishna First Look

ఈ పోస్టర్ చూసి నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌ గా సిరిసిల్లలో ప్రారంభమైంది. ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.

Also Read: మ‌రో పాద‌యాత్ర‌కు సంజ‌య్ రెడీ.. ఎప్ప‌టి నుంచి, ఎక్క‌డి నుంచి..?

 

Balakrishna First Look

Balakrishna First Look

‘బాలయ్య బాబు’ అరవై ఏళ్ల వయసులో ‘అన్ స్టాపబుల్’లా దూసుకువెళ్తున్నాడు. ఏది ఏమైనా ‘అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్య క్రేజ్ నేషనల్ రేంజ్ లో పాకింది. బాలయ్యకి అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది. క్రేజ్ డబుల్ అయింది. బాలయ్యతో సినిమాలు చేయాలని బడా నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. పైగా బాలయ్య ముందు ఆలోచించేదే నిర్మాత గురించి.

నిర్మాత లాభం కోసం, బాలయ్య అర్ధరాత్రులు కూడా పని చేసిన సంఘటనలు ఉన్నాయి. అందుకే, బాలయ్య డేట్లు కోసం ఇప్పుడు అందరూ ఎగబడుతున్నారు. ఇక ఫస్ట్ లుక్ లో ముఖ్యంగా బాలయ్య లుంగీలో ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. బాలయ్య ఇంతకుముందు రాయలసీమ నేపథ్యంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్స్ కొట్టాయి. అందువలన అదే నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ కథను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags