Morning habits to avoid: మనిషికి కంటినిండా నిద్ర ఆరోగ్యకరమే. ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. కలతలేని నిద్ర ఉంటే శరీరంలో ఏదో శక్తి వచ్చినట్లు అవుతుంది. అయితే ఇలా హాయిగా నిద్రపోయి ఉదయం లేవగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతత రోజంతా ఉండాలంటే కొన్ని పనులను మానుకోవాలి. ముఖ్యంగా ఉదయం మనం ఎలాంటి పని చేస్తే ఆ రోజంతా కూడా అలాగే ఉంటామని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. మనం ఉదయం పాజిటివ్ విషయాలతో ప్రారంభిస్తే ఆరోజు పాజిటివ్ గానే ఉంటుంది.. అలాగే నెగిటివ్ విషయాలతో రోజును ప్రారంభిస్తే రోజంతా నెగిటివ్ గానే ఉంటుంది అని చెబుతున్నారు. అసలు పాజిటివ్ విషయాలు అంటే ఏమిటి? నెగటివ్ విషయాలు అంటే ఏమిటి? ప్రతిరోజు ఉదయం చేయకూడని పనులు ఏమిటి?
Also Read: మీరు ఏం వాటర్ తాగుతున్నారో..బాటిల్ మూత చెబుతుంది.. ఎలాగంటే..
చాలామంది ఉదయం లేవగానే సుప్రభాతం వినడానికి ఆసక్తి చూపుతారు. ఆ తర్వాత దేవుళ్ళ పాటలు వింటూ ఉంటారు. ఇలా వినేవారికి రోజంతా ఆధ్యాత్మిక వాతావరణం లాగా అనే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఉదయం ఏదైనా మంచి జరిగే పనుల గురించి మాట్లాడడం గాని.. లేదా మంచి జరగాలని కోరుకోవడం గానీ అనుకుంటే ఆ రోజంతా అలాగే ఉంటుంది. దీంతో ఎలాంటి సమస్యలు ఉండవు.
కానీ మరికొంతమంది ఉదయం లేవగానే నెగిటివ్ విషయాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. అంటే ఉదయం లేవగానే ముందుగా ఫోన్లో ఇలాంటి మెసేజ్ వచ్చాయో.. తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా న్యూస్ ఛానల్ పెట్టి క్రైమ్ న్యూస్ ను ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇలా చేసేవారికి ఆ రోజంతా నెగిటివిటీ ఎనర్జీ ఉంటుంది. ప్రతి విషయంలోనూ నెగెటివిటీ కనిపించి మనసంతా ఆందోళనగా ఉంటుంది. దీంతో ఏ పనిని సక్రమంగా చేయలేరు. అందువల్ల ప్రతిరోజు ఉదయం లేవగానే ఇలాంటి పనులు చేయకుండా ఉండడమే మంచిది అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: మీ పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉన్నారా?
సాధ్యమైనంత వరకు ఉదయం లేవగానే వ్యాయామం చేసే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత కనీసం 30 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల మనసు కుదుటపడుతుంది. దీంతో అప్పటి వరకు ఉన్న ఆలోచనలు క్రమ పద్ధతిలో ఉంటాయి. ఈ ధ్యానంలో ఏవైనా ఇష్టమైన పదాలు అనుకుంటూ ఉండాలి. అలాగే ఇష్టమైన వ్యక్తుల గురించి తలుచుకుంటూ ఉండాలి. అలా చేయడంవల్ల మనసులో ఏదో ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా బ్రేక్ ఫాస్ట్ అయ్యేంతవరకు కుటుంబ సభ్యులతో సరదాగా ఉండే ప్రయత్నం చేయాలి. అయితే ఈ సమయంలో ఏదైనా వివాదాలు తలెత్తితే వెంటనే పరిష్కరించే మార్గం చూడాలి. అవసరమైతే వాటి గురించి మధ్యాహ్నం మాట్లాడదాం.. అని సర్ది చెప్పుతూ ఉండాలి.
ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఇంట్లో గొడవ లు పెట్టుకోకుండా జాగ్రత్తపడాలి. అలాగే పిల్లల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలపై నెగెటివిటీ ప్రభావం చూపితే వారి మనసు ఆందోళనగా మారుతుంది. దీంతో వారు పాఠశాలల్లో సక్రమంగా చదవలేరు. అందువల్ల ఉదయం లేవగానే కొన్ని పనులను చేయకుండా జాగ్రత్త పడాలి.