Junk food and child behavior: ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలను పెంచడం కూడా ఒక పెద్ద ప్రయాస గానే మారింది. ఎందుకంటే వారు ఎప్పుడూ ఏ విధంగా ఉంటున్నారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉన్నా.. కొందరు పిల్లలు బయట వాతావరణం కు అలవాటు పడి కొత్త అలవాట్లను నేర్చుకుంటున్నారు. అలాగే వారు పెరిగే వాతావరణ పరిస్థితులు.. తినే ఆహారం పూర్తిగా మారిపోతుంది. ఒకప్పుడు పిల్లలు ఎలాంటి ఆహారం తిన్నా.. ఏ విధంగా చదువుకున్నా.. వారు ఏదో రకంలో స్థిరపడిపోయేవారు. కానీ ఇప్పుడు కచ్చితంగా చదివితేనే భవిష్యత్తులో రాణించే అవకాశం ఉంది. అయితే తల్లిదండ్రులు పిల్లల విషయంలో కాస్త కేర్ తీసుకుంటే వారి ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు. ఎందుకంటే వారు తినే ఆహారం కూడా పిల్లల మానసిక ప్రభావం పై తీవ్రంగా పడుతుందని కొందరు మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వారు చిరుతిళ్లు తింటే ఎలా ప్రవర్తిస్తారు అంటే?
Also Read: కొత్త రీసెర్చ్: 7 గంటలు.. 9 గంటలు.. అసలే ఎన్ని గంటలు నిద్రపోతే మంచిదంటే?
ఇంట్లో వండిన ఆహారం కంటే బయట దొరికే ఆహారానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు నేటి కాలం పిల్లలు. అయితే ఈ బయటి ఆహారం టేస్టీగా ఉండడానికి.. పిల్లలను ఆకర్షించడానికి కొన్ని రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కిరాణం షాపుల్లో కనిపించే చిప్స్ వంటివి పిల్లల మనస్తత్వాన్ని దగ్గరగా చేసుకుంటాయి. ఇందులో ఉండే ఆహార పదార్థాలను తినేందుకు ఆకర్షణీయమైన ప్యాక్ చేయడంతోపాటు కొన్ని రకాల బొమ్మలను కూడా అందిస్తున్నారు.
ఇప్పటివరకు ఎంతోమంది పిల్లలు ఇలాంటి ఫుడ్ తిన్నారు. కానీ వారికి ఏం కాలేదు.. అని ప్రశ్నిస్తున్నారు కొందరు. అయితే ప్రస్తుత వాతావరణం కలుషితంగా మారిపోతుంది. ఒకప్పుడు పిల్లలు ఎండలో ఎక్కువసేపు ఆడుకునేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు బయట దొరికే ఫుడ్ తినడం వల్ల వారిలో అనేక ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల వారి ప్రవర్తనలో కూడా తేడా ఉంటుంది.
Also Read: ఫోన్ పే లో కొత్త ఆప్షన్.. ఇక అవసరం ఉన్న డబ్బులకు మాత్రమే వడ్డీ చెల్లించవచ్చు…
ఎక్కువగా బయట ఫుడ్ తిని పిల్లలు వింతగా ప్రవర్తిస్తారు. అంటే నిత్యం చలాకిగా ఉన్నట్లే కనిపిస్తారు. కానీ ఒక్కచోట కుదురుగా ఉండరు. వీరు ప్రతి విషయాన్ని తొందరగా పూర్తి చేయాలని అనుకుంటారు. ప్రతి పనిలో తొందర పడుతూ తప్పులు చేస్తూ ఉంటారు. ఆహారాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి భిన్న మనస్తత్వాన్ని కలిగి ఉన్నారంటే వారు బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకోవాలి. బయట దొరికే ఫుడ్ లో ఎక్కువ శాతం కలర్ కలుపుతూ ఉంటారు. ఇది ఆకర్షణీయంగా కనిపించడంతోపాటు రుచిని కూడా ఇస్తుంది. కానీ ఈ ఫుడ్ కలర్ వల్ల శరీరంలో.. ముఖ్యంగా పిల్లల్లో రక్తప్రసరణను వేగంగా చేస్తుంది. అయితే ఇది కొంతవరకు బాగానే అనిపించినా..దీర్ఘకాలికంగా మాత్రం తీవ్రంగా నష్టాన్ని చేకూరుస్తుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఆహార పదార్థాలను తయారు చేసే పిల్లలకు అందించండి. బయట లభించే ఆహారం ఎక్కువగా తినడం వల్ల వారిలో వింత మనస్తత్వాలు ఏర్పడతాయి.