Money Tips: తమిళనాడు రాష్ట్రంలోని శివంగై జిల్లా తిరుపవనం అనే గ్రామానికి చెందిన కుటుంబం తమకు వచ్చిన ఆదాయాన్ని ఇంట్లో దాచుకున్నారు. అయితే వీరు ఒక పాత్రలో ఉంచి భూమిలో పాతిపెట్టారు. ఇలా పాతిపెట్టిన డబ్బు కొంతమేర చెదలు పట్టింది. దీంతో వీరి ఆవేదనను అర్థం చేసుకున్న నటుడు లారెన్స్ వారికి సాయం చేశారు. ఇలా ఇంట్లో డబ్బు మూలన పెడితే చెదలు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా చెదలు పట్టకుండా డబ్బును వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల రెట్టింపు సాధించే అవకాశం ఉంది. అసలు డబ్బు ఇంట్లో చెదలు ఎందుకు పడుతుంది? ఈ డబ్బుతో రెట్టింపు ఆదాయాన్ని ఎలా పొందవచ్చు?
డబ్బు సంపాదించడం అందరికీ తెలుసు. కానీ కొందరు మాత్రమే దానిని రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో నష్టం రావచ్చు.. లాభం రావచ్చు.. కానీ సాధ్యమైనంత వరకు లాభాలు వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రణాళిక ప్రకారంగా ఈ డబ్బును రెట్టింపు చేసే ప్రయత్నం చేయాలి. ప్రస్తుత కాలంలో డబ్బు పెట్టుబడులు పెట్టడానికి అనేకమార్గాలు ఉన్నాయి. కానీ అదనపు ఆదాయం రావడానికి కొన్ని మాత్రమే సరైనవే అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మన వద్ద మూలకు ఉన్న డబ్బుపై అదనపు ఆదాయం వడ్డీ రూపంలో ఎక్కువగా వస్తుంది. అంటే ఈ డబ్బును ఎవరికైనా అప్పుగా ఇస్తే దానిపై వడ్డీ వస్తుంది. లేదా బ్యాంకులో వేస్తే కొంతవరకు వడ్డీని చెల్లిస్తారు. ఇలా వడ్డీ రావాలంటే కొన్ని రోజుల సమయం వేచి చూడాలి.
కానీ మూలకు ఉన్న డబ్బుకు ముందే వడ్డీ వచ్చే మార్గాలు ఉన్నాయి. దీనినే రెగ్యులర్ ఫైనాన్స్ అని అంటారు. అంటే ఎవరికైనా డబ్బు అవసరము ఉంటే వారికి ఇచ్చే ముందే వడ్డీని కట్ చేసుకుని అవకాశం ఉంటుంది. ఇలా అత్యవసరం ఉన్నవారు ముందే వడ్డీని చెల్లించి అసలును తీసుకుంటారు. తిరిగి చెల్లించేటప్పుడు ఎంత అయితే ఇచ్చామో? అంత మేరకు తిరిగి చెల్లిస్తారు. అంటే ఉన్న డబ్బుకు ఆదాయం ముందే ముందే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. డబ్బు ఇచ్చేవారు తిరిగి చెల్లించే అవకాశం ఉందా? లేదా అనేది నిర్ణయించుకోవాలి.
Also Read: ధనవంతులు అవ్వాలంటే ఈ మైండ్‌సెట్ మార్చుకోవాలి!
డబ్బును రెట్టింపు చేసే క్రమంలో సెక్యూరిటీతో కలిగిన వడ్డీ రావాలని కొందరు అనుకుంటారు. ఈ క్రమంలో fixed డిపాజిట్ చేయడమే సరైన మార్గం. అయితే ఇలా చేయడం వల్ల కాలం తీరిన తర్వాత వడ్డీని చెల్లిస్తారు. అంతేకాకుండా ఇందులో తక్కువగా వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది.
నేటి కాలంలో ఇంట్లో డబ్బును ఊరికే పెట్టే బదులు లాంగ్ టర్మ్ లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే.. మ్యూచువల్ ఫండ్స్ సరైన మార్గమని ఆప్టిక నిపుణులు తెలుపుతున్నారు. ఇంట్లో డబ్బును ఉంచే బదులు ఇందులో పెట్టడం వల్ల లాంగ్ టర్మ్ లో రెట్టింపు డబ్బు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇంట్లో డబ్బులు చెదలు పట్టనివ్వకుండా ఇలా వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టి దాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేయండి..