Anasuya controversy: అనసూయ(ANASUYA BHARADWAJ) గ్లామర్ షో చేయడానికి కారణం అదే అంటూ షాకింగ్ ఆరోపణలు చేసింది సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి. హైపర్ ఆదితో పాటు సీనియర్ నటి అన్నపూర్ణ మీద సైతం ఆమె విరుచుకుపడ్డారు.
అనసూయ భరద్వాజ్ డ్రెస్సింగ్ పలుమార్లు వివాదాస్పదం కాగా.. సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి, తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. అనసూయ చర్యలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణకుమారిని… హైపర్ ఆది కారణంగానే జబర్దస్త్ వదిలేశానని అనసూయ అన్నారు. అది నిజమేనా? ఈ వివాదాన్ని ఎలా చూడాలని యాంకర్ అడిగింది. ఆమె చెప్పింది నిజమే. అయితే అనసూయ జబర్దస్త్ నుండి వెళ్లిపోవడం వలన నష్టపోయింది ఏమీ లేదు. పైగా ఆ షో వలన అనసూయకు ఫేమ్ వచ్చింది. మంచి షోలు, సినిమా అవకాశాలు వచ్చాయి.
Also Read: బిగ్ బాస్ తర్వాత నా జీవితం అలా అయ్యింది… టైటిల్ విన్నర్ కౌశల్ బయటపెట్టిన చేదు నిజాలు
ఆ మధ్య ఓ షోలో శేఖర్ మాస్టర్ షర్ట్ తీసేస్తే, అనసూయ కూడా తీసేసింది. అది ఇంట్లో పిల్లలు చూసే షో. తాను ఎలాంటి బట్టలు వేసుకున్నా కుటుంబ సభ్యులకు అభ్యంతరం లేదు అంటుంది. భర్తతో సముద్రతీరంలో దిగిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తారు. ఫేమ్ కోసం. అదే సమయంలో తాము ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధం అని ఒక సందేహం పంపడం కోసం. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఒకప్పుడు ఆడిషన్ జరిగే టైం లో కమిట్మెంట్ అడిగేవారు.
ఇప్పుడు కొందరు అప్లికేషన్ తో పాటు మేము అందుకు సిద్ధమని చెబుతున్నారు. మహిళలు పరిశ్రమలో లైంగిక దోపిడీకి, ఆర్థిక దోపిడీకి గురి అవుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఉందని పరిశ్రమలో ఉందని అందరికీ తెలుసు. దానిని కట్టడి చేయడానికి ఎవరు చర్యలు తీసుకోరు. హైపర్ ఆదిని ఎవరు అదుపు చేయాలి. మేనేజ్మెంట్ చేయాలి. హైపర్ ఆది జోక్స్ వారు వినడం లేదా? వారికి చెవులు పని చేయడం లేదా? అన్నపూర్ణ అంటే ఒక గౌరవం ఉండేది. చివరికి ఆమె కూడా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంది… అంటూ కృష్ణకుమారి ఫైర్ అయ్యారు.
Also Read: సితార బర్త్ డే వేళ మహేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్… ఆ సీక్రెట్ బయటపెట్టిన సూపర్ స్టార్
మరి కృష్ణకుమారి కామెంట్స్ పై అనసూయ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇటీవల కన్నుమూసిన కోట శ్రీనివాసరావు ఓ సందర్భంలో.. అనసూయ అందంగా ఉంటుంది. ఆమె పొట్టి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదని, అన్నారు. కోట మీద అనసూయ ఫైర్ అయ్యింది. ఘాటైన కౌంటర్ ఇచ్చింది. దుస్తుల విషయంలో తనను జడ్జి చేసే హక్కు ఎవరికీ లేదంటుంది అనసూయ. దాదాపు ఓ రెండేళ్లు బుల్లితెరకు దూరమైన అనసూయ గత ఏడాది రీఎంట్రీ ఇచ్చింది. ఆమె పలు షోల్లో సందడి చేస్తుంది.
