Moral Story: డబ్బు మనిషిని నడిపిస్తుంది. డబ్బు లేకుంటే అసలు జీవితమే లేదు. డబ్బుతోనే ప్రపంచం నిండిపోయింది. అయితే డబ్బుల కోసం మానవత్వాన్ని మరవద్దు. మనిషి గుణాన్ని మార్చుకోవద్దు. ఎందుకంటే డబ్బు అనేది అవసరాల కోసం మాత్రమే. మనుషులు, సంబంధాలు అనేవి శాశ్వతం అని గుర్తుపెట్టుకోవాలి. మనిషి విలువ కంటే డబ్బు ఏమాత్రం గొప్పది కాదని ఎన్నో కథలు ఉన్నాయి. ఒకప్పుడు డబ్బు కనిపించేది కాదు.. కేవలం మనుషులు మాత్రమే కనిపించేవారు. కానీ అప్పుడు కూడా జీవించారు. అయితే ఇందాక కాకుండా సాధారణ జీవితం గడిపారు. కేవలం విలాసవంతమైన జీవితానికి మాత్రమే డబ్బును ఉపయోగించుకుంటున్నారు. డబ్బు మాత్రమే జీవితంలో ముఖ్యం కాదని ఈ నీతి తెలుపుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఒక వ్యక్తికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇంట్లో బీరువానిండా డబ్బు ఉంటే సరిపోదు.. సాయం చేసే మనసులు ఉండాలి. డబ్బు ఉన్నప్పుడు అందరినీ దూరం పెడితే.. అత్యవసర సమయంలో ఎవరూ సాయం చేయడానికి ముందుకు రారు. ఇలాంటి సమయంలో మనుషులు మాత్రమే సహాయం చేయగలరు.. అందువల్ల డబ్బు కంటే మనుషులకు విలువ ఇవ్వాలని ఇది తెలుపుతుంది.
Also Read: What Can Astronauts Eat: వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?
అలాగే మట్టి ప్రతిమ లోనైనా.. వెండి గిన్నెలో అయినా.. బంగారపు పాత్రలో అయినా.. దీపం ఒకేలా వెలుగుతుంది. దీపం వెలగడం అనేది తను చేసే కర్తవ్యం. తను చేసే కర్తవ్యం విషయంలో డబ్బు ఉన్నదా? లేదా? అనేది చూడకూడదు. అప్పుడే దానికి విలువ పెరుగుతుంది. అలాగే దీపాన్ని అందరూ కోరుకుంటారు. పేదలు వెలిగిస్తారు.. డబ్బున్న వారు వెలిగిస్తారు.. అందరికీ ఒకేలాగా వెలుగుతుంది..
ఇలా ఏ విషయంలో చూసినా డబ్బు అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ.. మానవ సంబంధాలను పెంపొందించడానికి.. అత్యవసర సమయానికి ఏమాత్రం ఉపయోగపడదు. అందువల్ల డబ్బును ఒక అవసరం కోసం మాత్రమే చూడాలి. డబ్బు కోసం బంధాలను పెంచుకోవద్దు. తోబుట్టు రాను దూరం చేసుకోవద్దు.
కొందరికి ఆదాయం ఎక్కువగా ఉండవచ్చు.. మరికొందరికి తక్కువగా ఉండవచ్చు. ఎక్కువ ఆదాయం వచ్చినవారు తక్కువ ఆదాయం ఉన్న వారిని హేళన చేయద్దు. ఎందుకంటే వారి పరిస్థితిలకు అనుగుణంగా డబ్బు వారికి అందుతుంది. ఎప్పుడైనా వారు కూడా అధిక డబ్బులు సంపాదించే అవకాశం వస్తుంది. అయితే ఎక్కువ ఆదాయం ఉన్నవారు తక్కువ ఆదాయం వచ్చిన వారిని కించపరిస్తే భవిష్యత్తులో వీరికి ఉన్న డబ్బు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఉన్న సమయంలో ఎవరిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. దీంతో మనుషులు దూరమవుతారు. కుటుంబ సభ్యులు సైతం డబ్బు కోసం గొడవలు పడి ఇంట్లో నుంచి వెళ్లిపోతారు.
Also Read: Telugu Speakers in India: మన దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎంతో తెలుసా?
అయితే ప్రస్తుత కాలంలో డబ్బు ఉంటేనే విలువ అని చాలామంది చెబుతున్నారు. అవసరానికి డబ్బు సంపాదించుకోవాలి. ఒకవేళ ఎక్కువ డబ్బు ఉన్న గర్వం, అహంకారాన్ని విడాలి. డబ్బు కంటే ఎక్కువ మనుషులకు విలువ ఇవ్వాలి. అప్పుడే అలా ఎక్కువ డబ్బు కు విలువ వస్తుంది. లేకుంటే ఎంత ధనవంతుడైన వికారిగానే పిలవబడుతాడు.