Moment by moment suspense: క్షణ క్షణం ఉత్కంఠ.. నరాలు తెగే ట్విస్టుల్లాంటి ఈ మూడు చిత్రాలు వెంటనే చూసేయండి

కరోనా తరువాత సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లడం మానేశారు. ఇదే సమయంలో ఓటీటీలకు ప్రాధాన్యతపెరిగింది. అప్పటి నుంచి ఓటీటీల్లోనే చాలా సినిమాలు చూస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటాల్లిపాది ఇంట్లోనూ కూర్చుని సినిమా చూసే అవకాశం ఉండడంతో చాలా మంది వీటికి అలవాటు పడిపోతున్నారు.

Written By: Srinivas, Updated On : October 24, 2024 11:22 am

Twist-movies

Follow us on

Moment by moment suspense: కరోనా తరువాత సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లడం మానేశారు. ఇదే సమయంలో ఓటీటీలకు ప్రాధాన్యతపెరిగింది. అప్పటి నుంచి ఓటీటీల్లోనే చాలా సినిమాలు చూస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటాల్లిపాది ఇంట్లోనూ కూర్చుని సినిమా చూసే అవకాశం ఉండడంతో చాలా మంది వీటికి అలవాటు పడిపోతున్నారు. కొన్ని సినిమాలు సైతం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడంతో వినియోగదారులు కోరుకుంటున్న సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇటీవల వినియోగదారుల అభిరుచులు మారిపోతున్నాయి. సాధారణ సినిమాలు కాకుండా సస్పెన్స్, థ్రిల్లింగ్, రొమాన్స్ ఎక్కువగా ఉండే సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు సైతం ఇలాంటి సినిమాలను ఎక్కువగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే క్షణ క్షణం ఉత్కంఠతో ఉండే సినిమాలు కావాలని కోరుకుంటన్న వారికి ఈ మూడు సినిమాలు అలరిస్తున్నాయి. అవేంటంటే?

భారీ బడ్జెట్ తో థియేటర్లలో ఆడంబరంగా రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలు ఆకట్టుకోలేకపోతున్నాయి. కానీ సైలెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయి మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘కాడవర్’ ఒకటి. ఈ మూవీ రెండేళ్ల కిందటే ఓటీటీలోకి వచ్చినా.. ఇప్పటికీ ఆదరిస్తున్నారు. హీరోయిన్ అమలాపాల్ సొంత బ్యానర్ పై దీనిని నిర్మించారు. ఇందులో అమలాపాల్ కూడా నటించారు. ఆమెతో పాటు రిత్విక, మునిష్కాంత్, హరీష్ తదితరులు పోషించారు. ఓ డాక్టర్ హత్య కేసు నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంది. పూర్తిగా సస్పెన్షన్ థ్రిల్లింగ్ తో సాగే ఈ స్టోరీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఓటీటీలో అలరిస్తున్న మరో మూవీ ‘రన్ బేబీ రన్’. ఆర్జే బాలజీ అనే హీరో కెరీర్ లో ఉత్తమ చిత్రంగా ఇది నిలిచింది. ఇందులో తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా నటించారు. ఓ వ్యక్తి తన భార్య చెవి పోగుల కొనుగోలు చేయడానికి వెళ్తాడు. ఈ సమయంలో అతడు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటాడు. ఈ అయితే కాన్సెప్ట్ సాధారణమే అయినా దీనిని తీర్చి దిద్దడంలో చాలా శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తుంది.

తెలుగు హీరో నవీన్ చంద్ర నటించి మరో మూవీ ‘రీపీట్’. ఇది కూడా రెండేళ్ల కిందట ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. క్రైం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఓ పోలీస్ ఆఫీసర్ కూతురును కిడ్నాప్ చేయడంతో దీనిని ఛేదించడంలో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నవీన్ చంద్ర కనిపిస్తాడు. అయితే సీన్ సీన్ కు ట్విస్ట్ లు ఇస్తూ సినిమా మొత్త థ్రిల్లింగ్ తో సాగుతుంది.

ఇలా తీవ్ర ఉత్కంఠతో సాగే ఈ సినిమాలను ఆదరిస్తున్నారు. ఇవే కాకుండా రొమాన్స్, అడల్ట్స్ మాత్రమే చూసే కొన్ని సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భారీ బడ్జెట్ తో సినిమా చిత్రీంచకపోయినా మంచి కంటెంట్ ఉంటే చాలు అన్నట్లుగా వీటిని ఫాలో కావడంతో కొందరు డైరెక్టర్లు సైతం ఇలాంటి వాటి చిత్రీకరణకు ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా యూత్ వీటికి ఎక్కువగా ఆదరిస్తుండడంతో సైలెంట్ గా అనుకున్న విధంగా సక్సెస్ సాధిస్తున్నాయి.