Mekathoti Sucharitha : వైసీపీకి మరో మహిళా కీలక నేత గుడ్ బై!

ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసిపి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. వరుసగా నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ హోం మంత్రి ఇదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : October 24, 2024 11:25 am

Mekathoti Sucharitha

Follow us on

Mekathoti Sucharitha :  వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెబుతున్నారా? వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగిన నాయకురాలు పార్టీపై అసంతృప్తితో ఉన్నారా? కూటమిలోని ఓ పార్టీలో చేరనున్నారా? ఇప్పటికే మంతనాలు పూర్తయ్యాయా? ఇక చేరడమే తరువాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ ఓటమిని పార్టీ శ్రేణులు సైతం జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఏకంగా రాజ్యసభ పదవులు ఉన్నవారు సైతం పార్టీకి రాజీనామా ప్రకటిస్తున్నారు. అధికార పార్టీలో చేరిపోతున్నారు. ఎమ్మెల్సీల పరిస్థితి అలానే ఉంది. పలువురు తాజా మాజీ మంత్రులు సైతం అదే బాట పట్టారు. వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగిన నాయకులు సైతం పార్టీని వీడుతున్నారు. నిన్నటికి నిన్న మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా ప్రకటించారు. జగన్ పై విమర్శలు గుప్పించారు. అది మరువకముందే గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళా నేత పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసిపి హయాంలో హోం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మేకతోటి సుచరిత తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు మేకతోటి సుచరిత. రాజశేఖర్ రెడ్డి పిలిచి మరి ప్రత్తిపాడు నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. అప్పటినుంచి అదే నియోజకవర్గ నుంచి ఎన్నికవుతూ వచ్చారు సుచరిత. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచేసరికి జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఏకంగా హోం మంత్రి పదవి ఇచ్చారు. దీంతో మేకతోటి సుచరితకు పార్టీతో పాటు ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యత పెరిగింది. అయితే విస్తరణలో ఆమె పదవిని తొలగించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.దానిని ఒక అవమానంగా భావించారు. కొద్దిరోజులపాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అప్పట్లోనే ఆమె పార్టీ మారతారని ప్రచారం సాగింది. కానీ అప్పటి రాజకీయాలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు.

* జనసేనలో చేరతారని ప్రచారం
ఎన్నికలకు ముందు మేకతోటి సుచరిత జనసేన లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దాదాపు జనసేన పెద్దలతో చర్చలు కూడా జరిపినట్లు టాక్ నడిచింది. దీంతో వైసిపి హై కమాండ్ ఆమెతో చర్చలు జరిపింది. కుటుంబంతో సహా మీడియా ముందుకు వచ్చిన ఆమె.. చివరి వరకు జగన్ తోనే నడుస్తామని చెప్పుకొచ్చారు. అయితే జగన్ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తాడికొండకు మార్చడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు సుచరిత. అయిష్టంగానే తాడికొండ నుంచి పోటీ చేశారు. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత పెద్దగా పార్టీలో యాక్టివ్ గా లేరు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె జనసేనలో చేరతారని సమాచారం. మొత్తానికైతే వైసీపీ అధినేత జగన్కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.