Mobile Phone In Toilet: సమాజంలో ఫోన్ అవసరం చాలా పెరిగింది. ఇదొక అత్యవసర సాధనంగా మారింది. ఇక ఈ ఫోన్ తో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉందనేది కాదనలేని వాస్తవం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సంతోషపడాలో, బాధపడాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఫోన్ గురించి దాన్ని యువత ఉపయోగించే విధానం గురించి తెలుసుకుంటే చాలా భయం వేస్తుంది కూడా.ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. కొందరు బాత్రూమ్ లోకి కూడా ఫోన్ ను తీసుకెళ్తుంటారు.
టాయిలెట్ మీద కూర్చొని ఏకాంతంగా సినిమాలు, వీడియోలు చూస్తుంటారు కొందరు. కానీ దీని వల్ల వారికి మాత్రమే కాదు వారితో ఉండేవారికి కూడా ప్రమాదకరమే. మీతో ఉన్నవారికి అదే సమయానికి బాత్రూమ్ కు వెళ్లే అవకాశం ఉండదు. మీకు వచ్చే జబ్బులు ఇంట్లో వారికి వస్తాయి. అందుకే మీకు బాత్రూమ్ లో ఎక్కువ సేపు ఫోన్ పట్టుకొని కూర్చొనే అలవాటు ఉంటే వెంటనే మర్చిపోండి. వాష్ రూమ్ కు ఫోన్ లేకుండా వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ. తీసుకొని వెళ్లే వారి సంఖ్యనే ఎక్కువ అయిందట.
బాత్రూమ్ లో ఫోన్ ను పట్టుకొని గంటలు కూర్చోవడం మంచిది కాదట. ప్రతి ఫ్లష్ బ్యాక్టీరియాను గాలిలోకి పంపుతుంది. సాల్మోనెల్లా, ఇ. కోలి వంటి జెర్మ్స్ తో మీ ఫోన్ ను కవర్ అయిపోతుంది. ఇక ఈ జెర్మ్స్ డయేరియా, కడుపు ఇన్ఫెక్షన్లు, ప్రేగు సంబంధిత వ్యాధులు, అంటువ్యాధులు, మూత్ర వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇక పురుషులకు మరింత ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు నిపుణులు.
టాయిలెట్ లో ఫోన్ ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మీ పురుష నాళం మీద ఒత్తిడి పడుతుందట. దీని వల్ల పైల్స్ వంటి సమస్యలు వస్తాయట. అందుకే ఇక నుంచి అయినా ఫోన్ ను టాయిలెట్ కు తీసుకెళ్లె అలవాటు ఉంటే వెంటనే మానేయండి. వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.