Drinking Water: నీరు అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉంటారు? కచ్చితంగా నీరు తాగకుండా ఒక రోజు కూడా ఎవరు ఉండలేరు. తిన్న తర్వాత, తినేకంటే ముందు ఇలా చాలా సార్లు నీటిని తాగుతారు చాలా మంది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు నీరు తాగడం చాలా మంచిది అని కూడా చెబుతారు నిపుణులు. అయితే రోజుకు 6 నుంచి 7 లీటర్ల వరకు నీటిని తాగాలి అంటారు డాక్టర్లు. ఇంతకీ నీరు ఎక్కువ తాగవచ్చా? లేదా? తాగితే ఏమైనా సమస్యలు వస్తాయా అనే వివరాలు తెలుసుకుందాం.
అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఏదైనా అతిగా తీసుకుంటే అనర్థాలే వస్తాయి. ఈ నీటిని కూడా తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లేదంటే అనారోగ్య పాలు కావాల్సిందేనట. ఇక ఉదయం లేవగానే కొందరికి నీరు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఉదయం నిద్ర లేచిన తర్వాత మోతాదుకు మించి నీటిని తాగకూడదట. కేవలం ఒక గ్లాసు మాత్రమే తాగాలి అంటున్నారు నిపుణులు. రక్తంలో సోడియం గాఢత తగ్గిపోయే స్థితిని హైపోనట్రేమియా అంటారట. ఇక అధికంగా నీరు తీసుకోవడం వల్ల సోడియం స్థాయిలు తగ్గి అసమతుల్యత ఏర్పడుతుంది.
ఓవర్ హైడ్రేషన్ లేదా డీ హైడ్రేషన్ వల్ల తలనొప్పి వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మీరు గనక ఎక్కువ నీరు తాగితే రక్తంలో ఉప్పు తగ్గుతుంది. దీని వల్ల అవయవాలలో వాపు వస్తుంటుంది. ఎక్కువ నీరు సేవిస్తే ఎలక్ట్రోలైట్ స్థాయిలు పడిపోతాయట. దీని వల్ల కండరాల తిమ్మరి రావచ్చు. అంతేకాదు నీరు ఎక్కువ తాగితే అలసట కూడా వస్తుందట.
పొటాషియం లోపానికి దారి తీస్తుంది అధిక నీరు. పొటాషియం శరీరంలో ముఖ్యమైన మినరల్. దీని లోపం వల్ల కాళ్లలో మంట, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి జాగ్రత్త. ఇక తరచూ మూత్ర విసర్జన సమస్య కూడా వస్తుంది. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోకుండా మీ డాక్టర్ సలహా మేరకు మాత్రమే నీటిని తీసుకోండి.