Mini Goa: ఒక్కసారైనా వెళ్లాల్సిన మీనీ గోవా ఇదీ.. విశేషాలేంటో తెలుసా?

రాష్ట్రం సముద్ర తీరం ఎక్కువగా ఉన్నందున బీచ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి బీచ్‌లు శుభ్రంగా, అందంగా ఉంటాయి. పర్యాటకులను ఆకర్షిస్తాయి. గోవాను తలపించేలా ఉండడంతో మినీ గోవా అని పిలుస్తారు.

Written By: Raj Shekar, Updated On : March 13, 2024 10:10 am

Mousuni-Island

Follow us on

Mini Goa: వేసవి వచ్చిందంటే చాలు ఏదో ఒక టూర్‌కు ప్లాన్‌ చేస్తారు. చాలా మంది గోవా వెళ్లాలి అనుకుంటారు. వెళ్లొస్తారు కూడా. అయితే గోవా వెళ్లడం సాధ్యం కానివాళ్లు ఈ మినీ గోవాకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. మినీ గోవానా.. అదెక్కడ ఉంది అనుకుంటున్నారా.. అవును మినీ గోవా కూడా మన దేశంలోనే ఉంది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఈ అందమైన మినీ గోవా ఉంది. ఏటా భారత్‌ నుంచే కాదు విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇది బంగాళాఖాతానికి సమీపంలో ఉన్నందున పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. అందుకే బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రాష్ట్రం సముద్ర తీరం ఎక్కువగా ఉన్నందున బీచ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి బీచ్‌లు శుభ్రంగా, అందంగా ఉంటాయి. పర్యాటకులను ఆకర్షిస్తాయి. గోవాను తలపించేలా ఉండడంతో మినీ గోవా అని పిలుస్తారు.

మౌసుని దీవి…
పశ్చిమబెంగాల్‌లో ఉన్న మౌసుని దీవిని మినీగోవా అంటారు. బంగాళాఖాతం ఒడ్డున ఉన్న ఈ ద్వీపం సరిహద్దు ద్వీపాల్లో ఒకటి. మినీ గోవాగా ప్రసిద్ధి చెందిన ఈ ద్వీపాన్ని చూడడానికి పర్యాటకులు ఏడాది పొడవునా వస్తుంటారు. మౌసుని ద్వీపం ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడి వాతావరణం సంగీతం లేకుండానే మీతో డ్యాన్స్‌ చేయిస్తుంది. బీచ్‌ ఒడ్డున కూర్చొని ప్రశాతంతమైన వాతావరణంలో అందమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇక్కడి దృశ్యాలు కనువిందు చేస్తాయి. మినీ విలేజ్‌గా పిలువబడే మౌసుని ద్వీపం పర్యాటకానికి మాత్రమే ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు తమ కుఉటంబం, స్నేహితులతో ఇక్కడకు పిక్నిక్‌ కోసం వస్తుంటారు. మౌసుని ద్వీపం చుట్టూ అనేక ద్వీపాలు కూడా ఉన్నాయి. వాటిలో చూడాల్సిన మూడు ద్వీపాలు ఇవీ..

1. జంబూ ద్వీపం..
మౌసుని ద్వీసం సమీపంలో ఉన్న జంబూ ద్వీపం కూడా పర్యాటకంగా చాలా ప్రసిద్ధి చెందింది. సాయంత్ర సముద్రం నుంచి వచ్చే అలలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ ద్వీపాన్ని చూడాలంటే ముందుగా అక్కడి అధికారుల అనుమతి తీసుకోవాలి.

2. బక్కలి
ఇక మౌసుని ద్వీపం సమీపంలో సందర్శించాల్సిన మరో ద్వీపం బక్కలి. ఈ ప్రదేశం నేచర్‌ లవర్స్‌కు ఎంతో నచ్చుతుంది. భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. మౌసుని ద్వీపం నుంచి బక్కలి చేరుకోవడానికి పడవలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయానం కూడా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

3. అడ్వెంచర్‌ యాక్టివిటీ..
పశ్చిమ బెంగాల్‌లోని మినీ గోవాను అన్వేషించాలి అనుకుంటే ఇక్కడ సాహస కార్యకలాపాలను కూడా చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ వాటర్‌ స్కీయింగ్, జెట్‌ స్కీయింగ్‌ కాకుండా మౌసుని ద్వీపంలో స్కూబా డైవింగ్‌ కూడా చేయవచ్చు. ఇది కోల్‌కతా నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.