https://oktelugu.com/

Bank Loan: బ్యాంకు లోన్ పూర్తి చేశారా? అయితే ఈ పొరపాటు చేయొద్దు..

ఇక్కడ కొందరు ఖాతాదారులు చేసిన పొరపాట్లు కారణంగానే ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఆ పొరపాటు ఏంటో తెలుసుకుందాం..

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2024 10:09 am
    Follow us on

    Bank Loan: కాలం మారుతున్న కొద్దీ అవసరాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఖర్చులు మోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయం సరిపోకపోవడంతో బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. అయితే కొన్ని అవసరాల నిమిత్త బ్యాంకు లోన్ తీసుకొని.. వాటి ఈఎంఐ కంప్లీట్ అయిన తరువాత కూడా బిల్లు జనరేట్ అవుతూనే ఉంటుంది. కొంత మంది ఖాతాదారులు ఈ విషయాన్ని గ్రహించి ఖంగుతిన్నారు. ఇక్కడ కొందరు ఖాతాదారులు చేసిన పొరపాట్లు కారణంగానే ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఆ పొరపాటు ఏంటో తెలుసుకుందాం..

    చాలా మంది బ్యాంకు లోన్ తీసుకున్న తరువాత నెలనెలా ఈఎంఐని రెగ్యులర్ గా పే చేస్తారు. అయితే ఈఎంఐ పూర్తయిన తరువాత కూడా వీరికి బిల్ జనరేట్ అవుతుంది. అందుకు కారణం వారు No Objection Certificate (NOC) తీసుకోకపోవడమే. బ్యాంకు ఈఎంఐ పూర్తయిన తరువాత దీనిని తీసుకోవడానికి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కొన్ని బ్యాంకులు ఇవి పిలిచి మరీ ఇస్తాయి. కానీ కొందరు మాత్రం ఖాతాదారులు తీసుకోకపోవడమే బెటర్ అని ఆలోచిస్తాయి.

    ఈతరుణంలో ఎన్ వోసీ తీసుకోకపోవడంతో బ్యాంకు లోన్ పూర్తి కానట్లే. అందువల్ల ఎన్ వోసీ తప్పనిసరిగా తీసుకోవాలి. లోన్ పూర్తి కాగానే బ్యాంకు వారు వెరిఫై చేసిన తరువాత దీనిని అందిస్తారు. దీని ఆధారంగా మరోసారి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండో సారి లోన్ తీసుకునే అవసరం ఏర్పడినప్పుడు కచ్చితంగా ఎన్ వోసి సర్టిఫికెట్ అడుగుతారు. ఇందులో కస్టమర్ చెల్లించిన ఈఎంఐ, తదితర వివరాలు ఉంటాయి. ఇందులో గుడ్ కస్టమర్ అని ఉంటే..సిబిల్ స్కోర్ తో అవసరం లేకుండా రుణాలు మంజూరు చేస్తాయి.

    అందువల్ల ఎన్ వోసీ సర్టిఫికెట్ ను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆన్ లైన్ లో లోన్ తీసుకుంటే మాత్రం ఈఎంఐ పూర్తి అయినట్లు కూడా జారీ చేస్తారు. లేదా కస్టమర్ యాటిట్యూట్ ను తెలియజేస్తూ మెసేజ్ పెడుతారు. దీని ద్వారా రెండో లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు లోన్ తీసుకునే వారు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నో డ్యూస్ సర్టిఫికెట్ లేకుండా బ్యాంకు లోన్ పూర్తి చేయొద్దు.