Homeలైఫ్ స్టైల్Middle Class People : ధనవంతుల లాగా నటిస్తున్న మిడిల్ క్లాస్ పీపుల్స్.. ఏం జరగనుందో...

Middle Class People : ధనవంతుల లాగా నటిస్తున్న మిడిల్ క్లాస్ పీపుల్స్.. ఏం జరగనుందో తెలుసా?

Middle Class People : ప్రస్తుత కాలంలో జీవితం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉందని కొందరు నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సెక్యూరిటీ లేకుండా పోయింది. ఎప్పుడు? ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చెప్పలేకుండా పోయింది. ఇలాంటి సమయంలో డబ్బు చాలా కీలకంగా మారింది. అయితే కొందరు కాస్త డబ్బులు చేతిలో కనిపించగానే హుందాగా జీవించాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ధనవంతులతో పోటీ పడుతూ వాళ్ల లాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? అంతేకాకుండా ఇలా చేయడం ఎంత ప్రమాదమో తెలుసా?

పేదవారు పేదవారి లాగానే ఉంటారు. వారు ఎటువంటి ఆశకు పోకుండా ఉంటారు. వారికి వచ్చిన ఆదాయంలో కొంత భాగం లేదా పూర్తిగా తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. ధనికవర్గాలు తమ గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. తమకు ఎలాగో ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి.. ఆ ధనంతో వారు లగ్జరీ లైఫ్ను మెయింటైన్ చేస్తారు.

Also Read: బాలకృష్ణ,వెంకటేష్ భారీ మల్టీస్టార్రర్ ఫిక్స్..డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

కానీ మధ్యతరగతి ప్రజలు మాత్రం ఇటు పేదవారి లాగా ఉండలేక.. అటు ధనవంతులతో పోటీపడి.. వారిలాగా మెయింటైన్ చేయలేక సతమతమవుతున్నారు. ఎలా అంటే? ఒక వ్యక్తికి 40,000 సాలరీ వస్తే.. అందులో 20,000 ఇంటి అద్దకే పోతుంది. మరో 5,000 కుటుంబ ఖర్చులకు పోతున్నాయి. ఇంకో 5,000 వీకెండ్ లేదా మంత్ ఎండింగ్ ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారు. మిగతా 5000 పెట్రోల్ లేదా ఇతర ఖర్చులకు పోతున్నాయి. అంటే కేవలం రూ 5000 మాత్రమే చేతిలో ఉంటున్నాయి. కొందరు ఈ 5,000 సరిపోక అప్పులు తీసుకుంటున్నారు. వాటి ఈఎంఐలు కట్టలేక మరికొన్ని అప్పులు చేస్తున్నారు. ఇలా వారు అప్పులు కడుతూనే ఉన్నారు.

అయితే మధ్యతరగతి ప్రజలు తమకు వచ్చిన ఆదాయం ప్రకారంగా మాత్రమే జీవితాన్ని కొనసాగించాలి. ఉదాహరణకు మధ్యతరగతి వ్యక్తి తనకు కారు కొనలేని స్తోమత లేనప్పుడు ద్విచక్ర వాహనంతోనే జీవితాన్ని కొనసాగించాలి. అలాగే ఇల్లు కొనలేని పరిస్థితి ఉన్నప్పుడు.. అనవసరమైన అప్పులు చేయకుండా ఉండాలి. ఎదుటివారు ఎక్కువ ధరతో వస్తువులు కొనుగోలు చేస్తున్నారని.. వారితో పోటీ పడకుండా ఉండాలి.

సాధ్యమైనంతవరకు చిల్లర ఖర్చులను దూరం చేసుకోవాలి. ఉదాహరణకు స్నేహితులతో వెళ్లినప్పుడు జేబులో ఉన్నంతవరకు మాత్రమే ఖర్చు చేయాలి. ఈ విషయంలో కొంత అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అవమానం కంటే జీవితం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు సేఫ్ గా ఉంటేనే.. భవిష్యత్తులో అవసరానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు గొప్పలకు పోయి ఖర్చులు చేస్తే.. జీవితాంతం ఖర్చులతోనే కొనసాగిస్తుంటారు.

అందువల్ల మధ్యతరగతి ప్రజలు తమ జీవితాలను చక్కబెట్టుకునే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం AI అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు పోతున్నాయో చెప్పలేని పరిస్థితి ఉంది. అందువల్ల ఎలాంటి ప్రయోగాలకు పోకుండా ఉన్నదాంట్లోనే జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. ఇతరులతో పోల్చుకోకుండా వచ్చిన ఆదాయంలోనే జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే అనుకున్న విజయాన్ని సాధిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version