Homeఆంధ్రప్రదేశ్‌AP Ghee Adulteration Controversy: కూటమి గురి కల్తీపై.. వైసిపి మాత్రం కాపు అంశంపై!

AP Ghee Adulteration Controversy: కూటమి గురి కల్తీపై.. వైసిపి మాత్రం కాపు అంశంపై!

AP Ghee Adulteration Controversy: ఏపీలో( Andhra Pradesh) నెయ్యి కల్తీ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. రాజకీయంగాను వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ పార్టీ హెరిటేజ్ ను తెరపైకి తెచ్చింది. ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ సంస్థది అని చెప్పే ప్రయత్నం చేసింది. దానికి టిటిడి నెయ్యి కాంట్రాక్టును అప్పగించేందుకే కూటమి సర్కార్ నెయ్యి కల్తీ వ్యవహారం అంటూ హడావిడి చేస్తోందని ఆరోపించింది. అయితే ఇప్పటికే ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళ్ళింది. మధ్యలో హెరిటేజ్ ప్రస్తావన తీసుకువచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వం పూర్తి ఆధారాలతో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని బయటపెట్టింది. కానీ ఆ స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇవ్వలేకపోతోంది ఈ అంశంపై.

Also Read: లోకేష్ తలచుకుంటే అంతే!

* అంబటి అరెస్టుపైనే..
మాజీ మంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu) అరెస్ట్, పరామర్శలు, ఆయనను కాపు టైగర్ గా చిత్రీకరించే క్రమంలో.. ఆ విషయాల్లో చూపిస్తున్న శ్రద్ధ.. నెయ్యి కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి గట్టి కౌంటర్ అటాక్ ఇవ్వడం లేదు. వాస్తవానికి ప్రత్యేక దర్యాప్తు బృందం తన విచారణలో తేలిన అంశాలపై.. చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిసాయి. దానిపై ఆందోళనలు చేసిన క్రమంలోనే అంబటి రాంబాబు అరెస్టయ్యారు. ఆయన అరెస్టును రాజకీయంగా వాడుకోవాలని చూసింది. నెయ్యి కల్తీ కంటే.. అంబటి రాంబాబు కాపు ఇసుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చినట్లు అయింది. అంబటి రాంబాబు అరెస్టుకు కారణం నెయ్యి కల్తీ వ్యవహారం. కానీ వైసీపీ వాడుకుంటుంది కాపు కోణం.

* కౌంటర్ ఇవ్వడంలో విఫలం..
కూటమి ప్రభుత్వం నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో బయట పెట్టింది. దీంతో ప్రజల్లో ఉన్న అనుమానాలు రెట్టింపు అయ్యాయి. అయితే వైసీపీ నుంచి మాత్రం ఆ స్థాయిలో కౌంటర్ రావడం లేదు. ఎంతవరకు అంబటి రాంబాబు పరామర్శ, కాపుల అంశంతోనే సరి పెడుతున్నారు తప్ప.. నెయ్యి కల్తీ వ్యవహారం పై ఎవరూ మాట్లాడడం లేదు. వైసిపి ఫైర్ బ్రాండ్లు సైతం ఎందుకో సైలెంట్ గా ఉన్నారు. అంబటి రాంబాబు తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కోసమే మాట్లాడుతున్నారు. కాపు అంశాన్ని ముడి పెడుతున్నారు. కానీ నెయ్యి కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. నిజంగా అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పెట్టే విషయమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version