Mgnrega: రైతుల ఖాతాల్లోకి రూ.58 వేలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం గురించి తెలుసా? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

ఇటీవల ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గ పరిధిలోని రైతులకు రూ.58 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. అయితే ఇవి ఉపాధి హామీ పథకం కింద వచ్చినట్లు స్థానిక పశు వైద్యాధికారి తెలిపారు. వ్యవసాయం చేసే రైతులు తమ పంట నష్టం లేదా కరువు సమస్య వచ్చినప్పుడు వారికి ఉపాధిని కల్పించేందుకు ఈ పథకం ద్వారా రుణసాయం అందించారు. వాటి ద్వారా గొర్రెలు, ఆవులు, మేకలు కొనుగోలు చేసి వాటిని పెంచుతూ ఉపాధి పొందవచ్చని పశువైద్యాధికారి పేర్కొన్నారు.

Written By: Srinivas, Updated On : July 7, 2024 2:58 pm

Mgnrega

Follow us on

Mgnrega: దేశానికి వెన్నెముక రైతు అని పెద్దలు చెప్పారు. దశాబ్ద కాలంలో రైతుల అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. పెట్టుబడి సాయం కింద కేంద్రం పీఎం కిసాన్, తెలుగు రాష్ట్రాల్లో రైతు భరోసా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. అయితే ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నా ప్రకృతి పగబడితే రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఒక్కోసారి భారీగా పంట నష్టం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అదనంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇటీవల ఓ రైతు ఖాతాలో రూ. 58 వేలు జమ అయ్యాయి. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా అప్లయి చేసుకోవాలి?

ఇటీవల ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గ పరిధిలోని రైతులకు రూ.58 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. అయితే ఇవి ఉపాధి హామీ పథకం కింద వచ్చినట్లు స్థానిక పశు వైద్యాధికారి తెలిపారు. వ్యవసాయం చేసే రైతులు తమ పంట నష్టం లేదా కరువు సమస్య వచ్చినప్పుడు వారికి ఉపాధిని కల్పించేందుకు ఈ పథకం ద్వారా రుణసాయం అందించారు. వాటి ద్వారా గొర్రెలు, ఆవులు, మేకలు కొనుగోలు చేసి వాటిని పెంచుతూ ఉపాధి పొందవచ్చని పశువైద్యాధికారి పేర్కొన్నారు.

మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005లోనే ప్రారంభించారు. అయితే ఈ పథకం ద్వారా కరువు సమయంలో అంటే వేసవి కాలంలో కొన్ని ప్రాంతాల్లోక్రాప్ హాలీడే ప్రకటిస్తారు. ఈ సమయంలో రైతులకు ఎలాంటి పని ఉండదు. దీంతో ఈ పథకం ద్వారా వారికి 100 రోజుల పాటు పని కల్పిస్తారు. తగిన వేతనం ఇస్తూ అవసరమైన పనులను ప్రభుత్వం చేయిస్తుంది. అయితే ఇదే పథకం కిందికి రైతులకు ప్రత్యేకంగా ప్రయోజనాలు కల్పించనున్నారు. రైతులు తమ పంట నష్టం జరిగినప్పుడు ఉపాధి హామీ కింద రుణ సాయం పొందవచ్చు. వీటి ద్వారా సంబంధిత ఉపాధిని పొందవచ్చు.

ఈ పథకం ద్వారా వచ్చే రుణంతో ఉపాధినిచ్చే వాటిని మాత్రమే కాకుండా వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు, యంత్రాలు, సబ్సిడీ రుణాలు, రాయితీపై విత్తనాలు వంటివి కొనుగోలు చేయడానికి రుణాలు అందిస్తారు. ఈపథకం రైతులందరికీ వర్తిస్తుంది. అయితే ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి ఉపాధిని చేపట్టాలనుకుంటున్నామో దానికి సంబంధించిన వివరాలు.. ఉదాహరణకు గొర్రెల పెంపకం చేపడితే దానికి సంబంధించిన షెడ్డు వివరాలు సమర్పించాలి. అలాగే గొర్రెలు లేదా మేకలు పెంచాలనుకుంటే వాటి కోసం సొంత భూమిని కలిగి ఉండాలి. అయితే ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.