Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వం లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ఎడి ఇటీవలే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కనీవినీ ఎరుగని కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.ఇప్పటికే ట్రేడ్ అంచనాల ప్రకారం రూ.800 కోట్లు కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని తెలుస్తుంది.రూ.600 కోట్లు భారీ బడ్జెట్ తో కల్కి సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitab Bachhan),దీపికా పదుకొనె(Deepika Padukone) ముఖ్య పాత్రలలో నటించారు.
లోక నాయకుడు కమల్ హాసన్ కూడా ప్రతి నాయకుడు పాత్రలో ప్రేక్షకులను బాగా ఆకట్టున్నారు.శోభన,రాజేంద్ర ప్రసాద్,దిశా పాటని తదితరులు నటించారు.అయితే కల్కి సినిమా కథ మొత్తం దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించిన సుమతి పాత్ర చుట్టూనే ఉంటుంది.ఈ సినిమాలో దీపికా గర్భవతిగా సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు అని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.ప్రస్తుతం దీపికా నిజ జీవితం లో కూడా నిండు గర్భవతిగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.అయితే కల్కి సినిమా మూవీ మేకర్స్ ఈ సినిమాలో సుమతి పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే ను అనుకున్నారట.రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్(Prabhas),పూజ హెగ్డే కలిసి నటించిన సంగతి తెలిసిందే.
రాధే శ్యామ్ సినిమా పరాజయం పొందటం మరోపక్క పూజ నటనపై కూడా విమర్శలు రావడం కల్కి మూవీ మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తుంది.అయితే ఇందులో యెంత వరకు నిజముందో తెలియదు కానీ కల్కి సినిమాలో సుమతి పాత్రకు దీపికా అయితేనే న్యాయం చేసిందని పూజ అయితే అస్సలు సెట్ అయ్యేది కాదని అభిమానులు అభిప్రాయం పడుతున్నారు.అలాగే ఈ సినిమా కథను ముందుగా నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి గారికి వినిపించారట.నాగ్ అశ్విన్ కథ చెప్పిన విధానాన్ని,అతని విసన్ కు చిరంజీవి నాగ్ అశ్విన్ కు ప్రశంసలు కురిపించారట.దాంతో నాగ్ అశ్విన్ తన మనసులో మాట చెప్తూ ఈ కథను మీకోసమే రాసాను,మీరైతేనే బాగుంటుంది అని చెప్పారట.అప్పుడు చిరంజీవి నో చెప్తూ ఈ సినిమాలో భైరవ పాత్రకు నేను అస్సలు సెట్ కానని ప్రభాస్ అయితే ఈ సినిమాకు హుందాతనం వస్తుందని అని చెప్పుకొచ్చారట.ఇక ఆ తర్వాత భైరవ పాత్ర ప్రభాస్ దగ్గరకు వెళ్లడం ఆయన ఓకే చెప్పడం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం అన్ని వెంటవెంటనే జరిగి పోయాయి.