Biryani Leaf: దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంపై ప్రజలలో ఆసక్తి పెరుగుతోంది. ఒకప్పుడు రైతులను, వ్యవసాయాన్ని పట్టించుకోనప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ప్రస్తుతం యువత సైతం ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆధునిక యంత్రాలు, మందులను ఉపయోగించి విభిన్న పద్ధతుల్లో సాగు చేస్తున్నారు.
వ్యవసాయంలో లాభాలు, నష్టాలు అనేవి సర్వసాధారణమన్న విషయం తెలిసిందే. వాతావరణంలో మార్పులు, పంట చీడల బారిన పడినా, వర్షాలు -వరదలు వచ్చినా పంటలు నాశనం అవుతాయి. దీని కారణంగా నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అయితే దీన్ని సాగు చేస్తే మాత్రం నష్టం అనేది రాదంట. అంతేకాదు ఒక్క ఎక్కరం సాగు చేసినా కోటీశ్వరులు కావడం పక్కా అని తెలుస్తోంది. ఇంతకీ ఏం సాగు? ఎలా చేయాలి? అనేది తెలుసుకుందాం.
బిర్యానీ ఆకు సాగు.. దీనికి ఒకసారి పెట్టుబడి ద్వారా జీవితం అంతా డబ్బు సంపాదించవచ్చు. బిర్యానీ ఆకు సాగు చేసే పద్ధతి కూడా ఈజీగానే ఉంటుందని తెలుస్తోంది. ఒక్కసారి మొక్కను నాటితే చాలు. పంట తరచూ చేతికి వస్తుంది. దీని వలన ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చు. తక్కువ శ్రమ మరియు తక్కుత ఖర్చుతో బిర్యానీ ఆకును సాగు చేయొచ్చు. అంతేకాదు బిర్యానీ ఆకుకు మార్కెట్ లో సైతం విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ కారణంగానే బిర్యానీ ఆకు సాగు లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
బే లీఫ్ అనే పిలువబడే ఆకు సాగును ప్రోత్సహించేందుకు రైతులకు సబ్సిడీ కూడా అందిస్తుండటం విశేషం. జాతీయ ఔషధ మొక్కల బోర్డు ద్వారా రైతులకు సుమారు 30 శాతం వరకు సబ్సిడీ అందుతుంది. ఒక బే ఆకు మొక్క నుంచి సుమారు రూ.3000 నుంచి రూ.5000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఈ విధంగా 25 మొక్కల నుంచి ఏడాదికి సుమారు రూ.75 వేల నుంచి రూ.1,25,000 వరకు సంపాదించవచ్చు.
బిర్యానీ ఆకును భారతదేశంలోనే కాకుండా అమెరికా, యూరప్ వంటి దేశాల్లోనూ ఎక్కువగా వినియోగిస్తుంటారు. సూప్ లు,వెజ్ మరియు నాన్ వెజ్ వంటకాలలో విరివిగా ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు బిర్యానీ ఆకును ఇతర మసాలా వంటకాల్లో గరం మసాలాగా కూడా ఉపయోగిస్తారు. బిర్యానీ ఆకు ప్రధాన ఉత్పత్తి దేశాల్లో భారత్ తో పాటు మధ్య అమెరికా, ఇటలీ, ఉత్తర అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం మరియు రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.