Refrigerator: మీ రిఫ్రిజిరేటర్ గోడకు దగ్గరగా ఉందా.. అయితే బిల్లు మోత తప్పదు..!

ప్రస్తుతం రిఫ్రిజిరేటర్ లేని ఇల్లు లేదని చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ వాడకం సర్వ సాధారణంగా మారింది. ఫ్రిజ్ లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ మరికొన్ని విషయాలను అంతగా పట్టించుకోరు కొంతమంది.

Written By: Suresh, Updated On : December 21, 2023 4:29 pm

Refrigerator

Follow us on

Refrigerator: మారుతున్న కాలంతో పాటే రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులోకి వస్తుంటాయి. టీవీ, రిఫ్రిజిరేటర్, ఎలక్ట్రానిక్ కుక్కర్స్, మిక్సీ, గ్రైండర్స్ ఇలా ఒకటేమిటి ప్రతిదీ వినియోగంలోకి రావడంతో పనులు త్వరగానే అయిపోతున్నాయి. అలాగే వాడకానికి తగ్గట్టుగానే కరెంట్ బిల్లు కూడా వస్తుందనుకోండి.

ప్రస్తుతం రిఫ్రిజిరేటర్ లేని ఇల్లు లేదని చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ వాడకం సర్వ సాధారణంగా మారింది. ఫ్రిజ్ లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ మరికొన్ని విషయాలను అంతగా పట్టించుకోరు కొంతమంది. వాస్తవానికి ఫ్రిజ్ ను సరిగా నిర్వహించకపోతే త్వరగా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు దీని వలన కరెంట్ బిల్లు కూడా ఎక్కవగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా చాలా మంది తమ ఇళ్లల్లోని ఫ్రిజ్ లను గోడకు అతి దగ్గరగా పెట్టి ఉంచుతారు. ప్లేస్ తక్కువగా ఉండటం వంటి పలు కారణాల వలన ఇలా చేస్తుంటారు. అయితే ఫ్రిజ్ కు గోడకు మధ్య ఖాళీని వదలాలన్న సంగతి చాలా మందికి తెలియదు. గోడకు దగ్గరగా ఫ్రిజ్ ను పెట్టడం వలన రిఫ్రిజిరేటర్ కూల్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందంట. దీంతో విద్యుత్ బిల్లు కూడా ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా గాలి ప్రసరణకు తగినంత స్థలం లేనట్లయితే కంప్రెసర్ వేడెక్కడం జరుగుతుంది. దీని వలన ఫ్రిజ్ త్వరగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గాలి ప్రసరణ కోసం ఫ్రిజ్ గోడ నుంచి తగినంత దూరంలో ఉండే విధంగా చూసుకోవాలి. రిఫ్రిజిరేటర్ వెనుక గోడ నుంచి సుమారు రెండు అంగుళాలు, టాప్ క్యాబినెట్ నుంచి రెండు అంగుళాలు ప్లేస్ ఉండాలి. అదేవిధంగా రెండు వైపులా కూడా సుమారు 1/4 అంగుళాల దూరం ఉండాలని చెబుతున్నారు. అలాగే రిఫ్రిజిరేటర్ మోడల్ ని బట్టి నియమాలు మారే ఛాన్స్ ఉంది. అందుకే ఫ్రిజ్ తీసుకున్న తరువాత ప్రతి ఒక్కరై మాన్యువల్ ను విధిగా చదవడం ముఖ్యం.