Srikanth Bolla : శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేసినా కూడా చాలా మంది ఏం చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం చిన్నతనం నుంచే దృష్టి లోపంతో ఇబ్బంది పడ్డాడు. అయినా పట్టు విడవకుండా కష్టపడి చదివి ఈ రోజు ఓ కంపెనీకి ఏకంగా సీఈఓ అయ్యాడు. కళ్లు ఉన్న వాళ్లకే సాధ్యం కాని దాన్ని కూడా ఆ వ్యక్తి తన టాలెంట్ ఏంటో నిరూపించాడు. చిన్నప్పుడు హేళన చేసిన వారందరితో ఇప్పుడు చేతులెత్తి విషెష్ తెలిపేలా చేశాడు. పుట్టుకతోనే అంధుడైన ఆ వ్యక్తి నేటి ప్రపంచంలో ఓ పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్నాడు. ఇంతకీ ఎవరూ ఆ వ్యక్తి? అంధుడైన కూడా పారిశ్రామిక వ్యక్తిగా ఎలా మారాడు? ఇతని సక్సెస్ స్టోరీ మీకు తెలియాలంటే.. ఆర్టికల్‌పై ఓ లూక్కేయండి.
Also Read : మోదీ ఫిట్‌నెస్ సీక్రెట్ అదే.. ఏడాదిలో 300 రోజుల ఆహారం.. ఎన్ని కిలోలు తీసుకుంటారో తెలుసా!?
ఏపీలో మచిలీపట్నానికి చెందిన శ్రీకాంత్ బొల్లా అనే వ్యక్తి ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. పుట్టుకతోనే శ్రీకాంత్ అంథుడు. దీంతో చుట్టుపక్కల వాళ్లు అంధుడు కాదా వదిలేయమని తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు శ్రీకాంత్‌ను భారంగా కాకుండా బాధ్యతగా చూశారు. ఎలాగైనా తమ బిడ్డ మంచి పొజిషన్‌లో ఉండాలని ఎంతో కష్టపడి శ్రీకాంత్‌ను చదివించారు. వ్యవసాయం కుటుంబం కావడంతో ఆర్థిక సమస్యలు తప్పలేదు. అయినా కూడా తల్లిదండ్రులు వెనుకడుగు వేయకుండా పట్టుదలతో శ్రీకాంత్‌ను చదివించారు. శ్రీకాంత్ కూడా అలాగే కష్టపడి చదివాడు. అంధుడైనా కూడా చదవడానికి చిన్నప్పుడు దాదాపుగా ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాడు. ఎలాగైనా ఇంజనీర్ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాడు. అదే విధంగా చదవాలని ట్రై చేస్తే కళ్లు కనిపించవని, మ్యాథ్స్ చదవడానికి తనకి అర్హత లేదని స్కూల్ యాజమాన్యం అతన్ని తిరస్కరించింది. పట్టు వదలని శ్రీకాంత్ కోర్టును ఆశ్రయించాడు. ఆరు నెలలు పోరాడిన తర్వాత శ్రీకాంత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. సైన్స్ సబ్జెక్టులు శ్రీకాంత్ కూడా చదవవచ్చని తెలిపింది. దీంతో ఇంటర్ మ్యాథ్స్ చదివి 98 శాతంలో టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఐఐటీలో చదవాలని అనుకున్నాడు. కానీ కంటి లోపం వల్ల వాటిలో సీటు రాలేదు. దీంతో అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల్లో అప్లై చేసుకుంటే.. మసాచుసెట్స్‌లోని ఎంఐటీలో సీటు వచ్చింది. అయితే ఇక్కడ సీటు పొందిన ఫస్ట్ ఏపీ వ్యక్తి కూడా శ్రీకాంత్. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా అతనికి జాబ్ వచ్చింది. కానీ ఇండియాలో పనిచేయాలని ఇండియాకి తిరిగి వచ్చాడు.
ఇండియాలో ప్యాకేజింగ్ మెటీరియల్ వంటివి తయారు చేసే బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించాడు. వీటిలో అన్ని కూడా తాటి ఆకులతో తయారు చేశాడు. వీటివల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇలా ప్రారంభించిన కొన్నాళ్లకే అనగా 2017లో ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో 30 ఏళ్ల వయస్సు వారిలో 30 మంది జాబితాలో శ్రీకాంత్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత స్వాతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బిడ్డ కూడా ఉంది. ఒక అంధుడైన శ్రీకాంత్ దేశంలోని పారిశ్రామిక వేత్తల్లో ఒకరు. బొల్లాంట్ కంపెనీ విలువ 150 మిలియన్ల డాలర్లు. ఈ కంపెనీలో ప్రస్తుతం 500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వ్యాపార రంగంలో శ్రీకాంత్ తనదైన ముద్ర వేసుకున్నాడు. బొల్లాంట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ఇదే కాకుండా వికలాంగుల కోసం సమన్వై అనే ఒక సెంటర్‌ను కూడా ప్రారంభించారు. వికలాంగులు అయిన వారికి సాయం చేస్తున్నారు. ఇటీవల ఓ షోలో శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ చెప్పడంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇతని కోసం చర్చించుకుంటున్నారు.