Megan King : మేగాన్ కింగ్ కథ ఒక కల్పిత కథ అనుకోవద్దు. తన కథ దిగ్భ్రాంతికరమైనది. అంతేకాదు స్ఫూర్తిదాయకం కూడా. వేల, లక్షల మంది జీవించడానికి ఒక కాంతి కిరణం ఈమె. 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదం తన జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది. పరిస్థితి ఎంతగా మారిందంటే తను ‘అంతర్గత శిరచ్ఛేదం’ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమెను కాపాడటానికి ఇదొక్కటే మార్గం మిగిలి ఉంది. 37 శస్త్రచికిత్సలు, లెక్కలేనన్ని శారీరక బాధల తర్వాత, ఆమె తన కొత్త శరీరంతో జీవించే కళను నేర్చుకుంటోంది.
Also Read : వేసవిలో పెరుగుతున్న కంటి స్ట్రోక్ సమస్యలు
2005లో, ఆమెకు 16 ఏళ్ల వయసులో, ఆమె జిమ్ క్లాస్‌లో బంతి కోసం దూకిందట. అప్పుడే ఆమె కిందపడింది. దీంతో చీలమండలానికి దెబ్బతాకింది. అయితే, అసలు గాయం అనుకున్నదానికంటే చాలా తీవ్రమైనది. రెండు భుజాల కండరాలు లోపల విరిగిపోయాయి. వెన్నెముక కూడా గాయపడింది. శరీర పరిస్థితి మెరుగుపడటానికి బదులుగా మరింత దిగజారుతూనే ఉంది. తరువాతి కొన్ని సంవత్సరాలలో, తన శరీరంలోని కీళ్ళు బలహీనపడటం ప్రారంభించాయి. అంతర్గత కండరాలు విరగడం, ఇబ్బంది పెట్టడం ప్రారంభించాయి. దీంతో తను భరించలేని నొప్పిని అనుభవించడం ప్రారంభించింది కూడా.
22 శస్త్రచికిత్సలు
నొప్పి భరించలేనంతగా మారినప్పుడు, మేగాన్ ఆమె భుజాలు, పై వీపుపై మాత్రమే 22 శస్త్రచికిత్సలు చేయించుకుంది. శరీరం ఎందుకు నయం కావడం లేదో వైద్యులకు కూడా అర్థం కాలేదు. ప్రమాదం జరిగిన 10 సంవత్సరాల తర్వాత, 2015లో, హైపర్‌మొబైల్ ఎహ్లర్స్-డాన్లోస్ సిండ్రోమ్ (hEDS) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది అరుదైన జన్యు వ్యాధి. ఇది బంధన కణజాలాలను బలహీనపరుస్తుంది. కీళ్లను అస్థిరంగా చేస్తుంది.
2016 లో, తన మెడ ఎముక స్థానభ్రంశం చెందింది. వైద్యులు హాలో బ్రేస్ సహాయంతో మెడను నియంత్రించారు. దీనితో, పుర్రెలోని స్క్రూల ద్వారా మెడ స్థిరంగా ఉంచారు. ఒక సంవత్సరం తరువాత, బ్రేస్ తొలగించేటప్పుడు, ఒక ప్రాణాంతక సంఘటన జరిగింది. తన పుర్రె వెన్నెముక నుంచి దాదాపుగా వేరు అయిందట. దీనిని వైద్య పరిభాషలో అట్లాంటో-ఆక్సిపిటల్ డిస్లోకేషన్ లేదా ‘అంతర్గత శిరచ్ఛేదం’ అని పిలుస్తారు. అటువంటి పరిస్థితిలో, 90% కంటే ఎక్కువ కేసులలో రోగి మరణిస్తాడు.
మరణాన్ని ఓడించిన
న్యూరో సర్జన్ తన పుర్రెను తన చేతులతో పట్టుకున్నాడట. అప్పుడు కనీసం తను నిలబడలేకపోయిందట. తన కుడి వైపు అదుపులేకుండా వణుకిందట. కుర్చీలో వెనక్కి వాలిపోయి మృత్యువు ముందు నిలబడి ఉన్నట్లు ఫీల్ అయిందట మేగాన్. కానీ వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి అతని ప్రాణాలను కాపాడారు.
వైద్యులు తన పుర్రెను వెన్నెముకకు అనుసంధానించారు. తరువాత ఆమె వెన్నెముక మొత్తం కటి వరకు కలిసిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందో చెబితే కచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఆమె వంగలేకపోవచ్చు, తిరగలేకపోవచ్చు, తల ఏ దిశలోనూ కదపలేకపోవచ్చు. ఏకంగా మానవ విగ్రహంలా మారిపోయినట్టు.వెన్నెముక అస్సలు కదలదు. అయినా సరే తను ధైర్యాన్ని కోల్పోకుండా నేను జీవించడం మానేయలేదు. నాకు ధైర్యం ఉంది అంటుంది మేగాన్. నిజంగా పాపం కదా.
Also Read : నిద్రలో ఉలిక్కిపడుతున్నారా? ఇది ప్రమాదకరమా?
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram