Hit 3 Trailer: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ని ఇన్ని రోజులు మనం సాఫ్ట్ రోల్స్ లో, కామెడీ రోల్స్ మరియు మాస్ రోల్స్ లో చూసాము. ఆయన కెరీర్ ప్రారంభం నుండి చూస్తే ఎక్కువ శాతం పక్కింటి కుర్రాడి పాత్రలే ఉంటాయి. అలాంటి నాని ని కనికరం లేని పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ‘హిట్ 3′(Hit : The Third Case) లో చూడబోతున్నాము. మే 1న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లో హింసాత్మక సన్నివేశాల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అని అనుకోవచ్చు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన మలయాళం యాక్షన్ చిత్రం ‘మార్కో’ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కూడా దారి తీసింది. ఎందుకంటే ఆ చిత్రం లోని యాక్షన్ సన్నివేశాలను కాస్త సున్నిత మనస్కులు చూడలేరు.
Also Read: ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్…
‘హిట్ 3’ ట్రైలర్ ని చూస్తుంటే ‘మార్కో’ కి పదింతలు ఎక్కువ ఉండేలా ఉంది. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇంతటి హింసాత్మక ధోరణితో కనిపిస్తే బయట సమాజం అంగీకరిస్తుందా, సహజత్వానికి చాలా దూరంగా ఉంది కదూ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ చిత్రం పై అనేక విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ చిత్రంలో అర్జున్ సర్కార్ క్యారక్టర్ అలాంటిది. ఆ స్వభావం కారణంగా ఎన్నో ఇబ్బందులను డిపార్ట్మెంట్ లో ఎదురుకోవాల్సి వస్తుందట. అవన్నీ సినిమాలో చూపిస్తారట, కానీ వాటిని జనాలు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. అయితే లేడీ విలన్స్ తో పోరాట సన్నివేశాలు మన హీరోలు చాలా తక్కువగా చేస్తుంటారు. కానీ ఈ చిత్రం లో నాని లేడీ విలన్స్ తో కూడా ఫైట్ చేసి చంపడం వంటివి ఉంటాయని ట్రైలర్ లో చూపించారు.
బహుశా ఏ హీరో కూడా ఈ తరహాలో లేడీ విలన్స్ తో ఫైట్ చేయడం ఇప్పటి వరకు మనం చూసి ఉండము. అదే విధంగా ఈ ట్రైలర్ లో డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్ లో ఉండాలి..లేదంటే భూమి లోపల 6 ఫీట్ బొక్కలో ఉండాలి. ప్రవర్తనలో పరివర్తన చెందని ఏ క్రిమినల్ కూడా ఈ సమాజం లో తిరగడానికి వీలు లేదు’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. మూవీ థీమ్ ని చూస్తుంటే చిన్న బిడ్డలను కనిపించకుండా చేసే క్రిమినల్స్ ని పట్టుకునే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నాని ఇందులో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. హీరో అంతటి హింసాత్మక మార్గంలో ప్రయాణం చేస్తున్నాడంటే, కచ్చితంగా ఆ స్థాయి అన్యాయాలు సినిమాలో జరిగి ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఎమోషన్స్ కరెక్ట్ గా వర్కౌట్ అయితే సినిమా వేరే లెవెల్ కి వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.