Married Womens: మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో ఆచారవ్యవహారాలను పాటిస్తాము. ఈ విధంగా కొందరు ఈ ఆచార వ్యవహారాలను పాటించిన అప్పటికీ మరికొందరు మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డారని చెప్పాలి.కాలం ఎంత మారుతున్న కొన్ని సాంప్రదాయాలను మాత్రం తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు.అలాంటి వాటిలో ముత్తయిదువులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని అలా నియమాలను పాటించినప్పుడే దీర్ఘ సుమంగళిగా వుంటారని చెబుతారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది రోజుకు రెండు లేదా మూడుసార్లు స్నానాలు చేస్తుంటారు. కానీ ముత్తయిదువులు ఎల్లప్పుడూ ఇలా తరచూ స్నానం చేయకూడదు. ముత్తయిదువుల తలపై గంగాదేవి ఉంటారు.అలా గంగాదేవి ఉందంటే ఆమె ఎంతో పవిత్రతతో కూడుకున్నదని అర్థం అందుకే ఎక్కువసార్లు స్నానం చేయకుండా రోజుకు ఒక్కసారి మాత్రమే స్నానం చేయాలని చెబుతుంటారు. అదేవిధంగా నిండు ముత్తైదువ ఎల్లప్పుడు నుదుటిన బొట్టు కనిపించే విధంగా ఉండాలి. ప్రస్తుత కాలంలో చాలా మంది నుదటి పై బొట్టు లేకుండా కనబడుతూ ఉంటారు.
అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలంటే తప్పనిసరిగా జుట్టు మొత్తం అల్లుకొని ఉండాలి. అయితే ప్రస్తుతం ఎవరు చూసిన జుట్టు విరబోసుకుని కనబడుతుంటారు. జుట్టు విరబోసుకోవడం జేష్ఠా లక్ష్మికి ప్రతీక జేష్ఠ లక్ష్మి దరిద్రానికి సంకేతం కనుక జుట్టు విరబోసుకుని తిరగడం వల్ల దరిద్రం తిష్ట వేస్తుంది. ఇక గాజుల విషయంలో కూడా ముత్తైదువు తప్పనిసరిగా ఒక నియమాన్ని పాటించాలి. మన చేతిలో ఎల్లప్పుడూ కూడా గాజులు ఉండాలి.అయితే అవి ఫ్యాషన్ గా కాకుండా మట్టితో చేసిన గాజులు ఉండటం ఎంతో శుభప్రదం. ఇలా మట్టితో చేసిన గాజులను ధరించిన తర్వాత ఏదైనా ఫంక్షన్ లేదా శుభకార్యం జరిగినప్పుడు ఆ గాజులన్ని తీసేసి కొత్త గాజులు వేస్తుంటారు. అయితే ఎప్పటికీ ఇలా చేయకూడదు.మనం ఎలాంటి గాజులు ధరించిన పాత గాజు ఒకటి తప్పనిసరిగా ఉండాలి. పాత గాజు 10 గండాలను దూరం చేస్తుందని చెబుతుంటారు. కనుక ముత్తయిదువులు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి
Also Read: Union Budget Of India 2022: ఈ బడ్జెట్ లో ఏ వర్గాలకు న్యాయం? ఏఏ వర్గాలను ఆదుకోబోతోంది..?